రావయ్య యెక్కడి సుద్ది రవ్వ సేయక
(॥పల్లవి॥)
రావయ్య యెక్కడి సుద్ది రవ్వ సేయక
కావరపు సతులెట్టు గద్దించేరు నన్ను
(॥॥)
వలచిన నీవు నాకు వసమై వుండితేఁ జాలు
పళుపు లేమాడేరు సవతు లిఁక
అలరి నీవిచ్చిన ఆస గలితేఁ జాలు
చెలుల వెంగెము లేమి సేసీ నన్ను
(॥॥)
మగఁడవు నీవు నాతో మాటలాడితేఁ జాలు
యెగసక్కే లేమాడేరు యెవ్వరూ నిఁక
మొగమిచ్చి నీవు నాతో మొనసి నవ్వితేఁ జాలు
తెగి యేకాంతలు వచ్చి తేర్చేరు నన్ను
(॥॥)
శ్రీవేంకటేశ నీవు చేకొని కూడితేఁ జాలు
ఆవల నేమాడేరు ఆఁడువారిఁక
సేవ యిచ్చి యేలితివి నీవు మన్నించితేఁ జాలు
సోవల నే రమణులు సొలసేరు నన్ను
(||pallavi||)
rāvayya yĕkkaḍi suddi ravva seyaga
kāvarabu sadulĕṭṭu gaddiṁcheru nannu
(||||)
valasina nīvu nāgu vasamai vuṁḍidem̐ jālu
paḽubu lemāḍeru savadu lim̐ka
alari nīvichchina āsa galidem̐ jālu
sĕlula vĕṁgĕmu lemi sesī nannu
(||||)
magam̐ḍavu nīvu nādo māḍalāḍidem̐ jālu
yĕgasakke lemāḍeru yĕvvarū nim̐ka
mŏgamichchi nīvu nādo mŏnasi navvidem̐ jālu
tĕgi yegāṁtalu vachchi terseru nannu
(||||)
śhrīveṁkaḍeśha nīvu segŏni kūḍidem̐ jālu
āvala nemāḍeru ām̐ḍuvārim̐ka
seva yichchi yelidivi nīvu manniṁchidem̐ jālu
sovala ne ramaṇulu sŏlaseru nannu