Raavayya maa imtigi rachchalo numdamganela

రావయ్య మా ఇంటికి రచ్చలో నుండఁగనేల
Language

(॥పల్లవి॥)
రావయ్య మా ఇంటికి రచ్చలో నుండఁగనేల
కైవసమైతివి నాకుఁ గలఁగకు మిఁకను

(॥రావ॥)
నవ్వుల కేమనినాను నమ్ముదు నీమాటలెల్లా
మవ్వపు నీ చేఁతలును మంచి వందును
యెవ్వరేమి చెప్పినా నీ కెదురు పూనుకవత్తు
ఇవ్వల నా మోము చూచి యేల లోఁగేవయ్యా

(॥రావ॥)
చెనకిన చెనకులు చెలరేఁగి ఇచ్చగించు
పెనఁగినా వేఁడుకొని ప్రియము రేఁతు
మనసు మరచినాను మర్మములు దలఁ పింతు
ననిచి సిగ్గుల మించ నాతోను వలెనా

(॥రావ॥)
చప్పనై కలసినాను చవులట్టె వుట్టింతు
తప్పులు గలిగినాను దాఁతు నన్నియు
ఇప్పుడు శ్రీ వేంకటేశ ఇచ్చగించి కూడితివి
ముప్పిరిఁ దొంటిపనికి మొక్కఁగ నేమిటికి

(||pallavi||)
rāvayya mā iṁṭigi rachchalo nuṁḍam̐ganela
kaivasamaidivi nāgum̐ galam̐gagu mim̐kanu

(||rāva||)
navvula kemaninānu nammudu nīmāḍalĕllā
mavvabu nī sem̐talunu maṁchi vaṁdunu
yĕvvaremi sĕppinā nī kĕduru pūnugavattu
ivvala nā momu sūsi yela lom̐gevayyā

(||rāva||)
sĕnagina sĕnagulu sĕlarem̐gi ichchagiṁchu
pĕnam̐ginā vem̐ḍugŏni priyamu rem̐tu
manasu marasinānu marmamulu dalam̐ piṁtu
nanisi siggula miṁcha nādonu valĕnā

(||rāva||)
sappanai kalasinānu savulaṭṭĕ vuṭṭiṁtu
tappulu galiginānu dām̐tu nanniyu
ippuḍu śhrī veṁkaḍeśha ichchagiṁchi kūḍidivi
muppirim̐ dŏṁṭibanigi mŏkkam̐ga nemiḍigi