Raavayya imkanainaa ramani yalamelmamga

రావయ్య ఇఁకనైనా రమణి యలమేల్మంగ
Language

(॥పల్లవి॥)
రావయ్య ఇఁకనైనా రమణి యలమేల్మంగ
వెూవని పాదాలమీఁద మొక్కీ నీకు

(॥॥)
వదలుఁబయ్యెదతోడ వాడికచేఁతలతోడ
కదలుఁగన్నులఁ జూచె కలికి నిన్ను
వుదుటుగుబ్బలతోడ నొరసి వేఁడుకొంటాను
పెదవులెత్తి ఇంటికిఁ బిలిచీ నిన్ను

(॥॥)
సెలవినవ్వులతోడ చెక్కిటిచేతితోడ
కొలువుసేసె నీకుఁ గోమలి నేఁడు
మొలకసిగ్గులతోడ మొహములు చల్లి చల్లి
వెలయ నిందరిలోన విందుచెప్పీ నీకు

(॥॥)
చెంపచెమటలతోడ చిప్పిలుఁగళలతోడ
ఇంపువుట్ట సేవసేసె నిదె నీ వొద్ద
దింపని కాఁగిటితోడ తిరమై శ్రీవేంకటేశ
సంపదల విఱ్ఱవీఁగీ సమరతి నీయందు

(||pallavi||)
rāvayya im̐kanainā ramaṇi yalamelmaṁga
vĕూvani pādālamīm̐da mŏkkī nīgu

(||||)
vadalum̐bayyĕdadoḍa vāḍigasem̐taladoḍa
kadalum̐gannulam̐ jūsĕ kaligi ninnu
vuduḍugubbaladoḍa nŏrasi vem̐ḍugŏṁṭānu
pĕdavulĕtti iṁṭigim̐ bilisī ninnu

(||||)
sĕlavinavvuladoḍa sĕkkiḍisedidoḍa
kŏluvusesĕ nīgum̐ gomali nem̐ḍu
mŏlagasigguladoḍa mŏhamulu salli salli
vĕlaya niṁdarilona viṁdusĕppī nīgu

(||||)
sĕṁpasĕmaḍaladoḍa sippilum̐gaḽaladoḍa
iṁpuvuṭṭa sevasesĕ nidĕ nī vŏdda
diṁpani kām̐giḍidoḍa tiramai śhrīveṁkaḍeśha
saṁpadala viṭravīm̐gī samaradi nīyaṁdu