Raasabalubuvaamdu raama naadamdu vaamde

రాసబలుపువాఁడు రామ నాతఁడు వాఁడే
Language

(॥పల్లవి॥)
రాసబలుపువాఁడు రామ నాతఁడు వాఁడే
మోసపోక మనము మొక్కవలె వాఁడే

(॥రాస॥)
అడవికాటగాండ్లగ్గిలోఁ గఱలువేయ
వడఁబొడమినయట్టివాఁడు
నిడుపమోరలపెద్దనీలికోఁతులనెల్ల
బడిబడిఁ దిప్పినబలువింటివాఁడు

(॥రాస॥)
పుటగా నీరాలు దొబ్బుచు పెనుమడుగెల్లా
అటునిటుఁ బూడిసి యాతఁడు
తటుకున మింటి పెద్దదయ్యాలకోసము
కిటుకురాకాసుల గెలిసినవాఁడు

(॥రాస॥)
గామిడై బూమెల్ల గద్దెవేసుక యేలి
ఆమనిసేసినయాతఁడు
గీము శ్రీవేంకటగిరులలోనను
దోమటి సీతతో దొరయాయ వాఁడే

(||pallavi||)
rāsabalubuvām̐ḍu rāma nādam̐ḍu vām̐ḍe
mosaboga manamu mŏkkavalĕ vām̐ḍe

(||rāsa||)
aḍavigāḍagāṁḍlaggilom̐ gaṟaluveya
vaḍam̐bŏḍaminayaṭṭivām̐ḍu
niḍubamoralabĕddanīligom̐tulanĕlla
baḍibaḍim̐ dippinabaluviṁṭivām̐ḍu

(||rāsa||)
puḍagā nīrālu dŏbbusu pĕnumaḍugĕllā
aḍuniḍum̐ būḍisi yādam̐ḍu
taḍuguna miṁṭi pĕddadayyālagosamu
kiḍugurāgāsula gĕlisinavām̐ḍu

(||rāsa||)
gāmiḍai būmĕlla gaddĕvesuga yeli
āmanisesinayādam̐ḍu
gīmu śhrīveṁkaḍagirulalonanu
domaḍi sīdado dŏrayāya vām̐ḍe