Raaraampu limkanela raave neevu

రారాఁపు లిఁకనేల రావే నీవు
Language

(॥పల్లవి॥)
రారాఁపు లిఁకనేల రావే నీవు
సారెకుఁ బతి విలువఁ జలమా నీకు

(॥రారాఁ॥)
వేడుకలు దైవారె వెన్నెల నవ్వులు గారె
యేడకేడ పతిమాఁట లియ్యకొనవే
కూడుటే కావలె నొండె కోపమే కావలె నొండె
నీడనుండే యెండ దాఁకి నీకుఁ జుల్లునా

(॥రారాఁ॥)
మొక్కిన చేతులు రాసె మెకమోటములు వాసె
యిక్కువ విభునితేఁత కియ్యకొనవే
మక్కువైయుండుట వొండె మత్సరమైయుండుటొండె
వెక్కసాలు వినయాలు వెలయించఁ జెల్లునా

(॥రారాఁ॥)
చిత్తములు సరివచ్చె సిగ్గులెల్లా గురివిచ్చె
యెత్తి శ్రీవేంకటేశే లియ్యకొనవే
యిత్తల గూడితిరి మీరిద్దరును నొండొండె
మత్తిలి తొల్లిటిపొందు మరవఁగఁ జెల్లునా

(||pallavi||)
rārām̐pu lim̐kanela rāve nīvu
sārĕgum̐ badi viluvam̐ jalamā nīgu

(||rārām̐||)
veḍugalu daivārĕ vĕnnĕla navvulu gārĕ
yeḍageḍa padimām̐ṭa liyyagŏnave
kūḍuḍe kāvalĕ nŏṁḍĕ kobame kāvalĕ nŏṁḍĕ
nīḍanuṁḍe yĕṁḍa dām̐ki nīgum̐ jullunā

(||rārām̐||)
mŏkkina sedulu rāsĕ mĕgamoḍamulu vāsĕ
yikkuva vibhunidem̐ta kiyyagŏnave
makkuvaiyuṁḍuḍa vŏṁḍĕ matsaramaiyuṁḍuḍŏṁḍĕ
vĕkkasālu vinayālu vĕlayiṁcham̐ jĕllunā

(||rārām̐||)
sittamulu sarivachchĕ siggulĕllā gurivichchĕ
yĕtti śhrīveṁkaḍeśhe liyyagŏnave
yittala gūḍidiri mīriddarunu nŏṁḍŏṁḍĕ
mattili tŏlliḍibŏṁdu maravam̐gam̐ jĕllunā