Raaraadaa yimkanainaa ravvalu melaa

రారాదా యింకనైనా రవ్వలు మేలా
Language

(॥పల్లవి॥)
రారాదా యింకనైనా రవ్వలు మేలా
ఆరితేరి యడమాట లాఱడి మేలా

(॥రారాదా॥)
వేఱే యలిగి యొకచో వేగించినాఁ గొంత కాక
తఱి దవ్వులనుండే తుందుడుకు మేలా
తేఱిచూచి వొండొరుల తిట్లయినాఁ గొంత కాక
మాఱుమోములై వుండేటి మంకులు మేలా

(॥రారాదా॥)
కదిసి మచ్చరములకాఁకలైనాఁ గొంత గాక
యెదురుచూచే యాసల యేఁపులు మేలా
కొదలుచుఁ గనుకలిఁ గొసరినాఁ గొంత గాక
యెదలోన గుబ్బతిలే యీసులు మేలా

(॥రారాదా॥)
కొంతపుచేకత్తి గోరి కుమ్మెలయినాఁ గొంత గాక
చెంతలఁ జేరకుండేటిసిగ్గులు మేలా
ఇంతలో శ్రీవేంకటేశ యీ కూటమె మేలు గాక
చింతతోఁ బానుపుమీఁదివేరులు మేలా

(||pallavi||)
rārādā yiṁkanainā ravvalu melā
ārideri yaḍamāḍa lāṟaḍi melā

(||rārādā||)
veṟe yaligi yŏgaso vegiṁchinām̐ gŏṁta kāga
taṟi davvulanuṁḍe tuṁduḍugu melā
teṟisūsi vŏṁḍŏrula tiṭlayinām̐ gŏṁta kāga
māṟumomulai vuṁḍeḍi maṁkulu melā

(||rārādā||)
kadisi machcharamulagām̐kalainām̐ gŏṁta gāga
yĕdurusūse yāsala yem̐pulu melā
kŏdalusum̐ ganugalim̐ gŏsarinām̐ gŏṁta gāga
yĕdalona gubbadile yīsulu melā

(||rārādā||)
kŏṁtabusegatti gori kummĕlayinām̐ gŏṁta gāga
sĕṁtalam̐ jeraguṁḍeḍisiggulu melā
iṁtalo śhrīveṁkaḍeśha yī kūḍamĕ melu gāga
siṁtadom̐ bānubumīm̐diverulu melā