రాముఁడు లోకాభిరాముఁడు త్రైలోక్య
(॥పల్లవి॥)
రాముఁడు లోకాభిరాముఁడు త్రైలోక్య-
ధాముఁడు రణరంగభీముఁడు వాఁడె
(॥రాముఁ॥)
వరుఁడు సీతకు ఫలాధరుఁడు మహోగ్రపు-
శరుఁడు రాక్షససంహరుడు వాఁడే
స్థిరుఁడు సర్వగుణాకరుఁడు కోదండదీక్షా-
గురుఁడు సేవకశుభకరుఁడు వాఁడే
(॥రాముఁ॥)
ధీరుఁడు లోకైకవీరుఁడు సకలా-
ధారుఁడు భవబంధదూరుఁడు వాఁడే
శూరుఁడు ధర్మవిచారుఁడు రఘువంశ-
సారుఁడు బ్రహ్మసాకారుఁడు వాఁడే
(॥రాముఁ॥)
బలుఁడు యిన్నిటా రవికులుఁడు భావించ ని-
ర్మలుఁడు నిశ్చలుఁ డవికలుఁడు వాఁడే
వెలసి శ్రీవేంకటాద్రి విజనగరములోన
తలకొనెఁ బుణ్యపాదతలుఁడు వాఁడే
(||pallavi||)
rāmum̐ḍu logābhirāmum̐ḍu trailokya-
dhāmum̐ḍu raṇaraṁgabhīmum̐ḍu vām̐ḍĕ
(||rāmum̐||)
varum̐ḍu sīdagu phalādharum̐ḍu mahograbu-
śharum̐ḍu rākṣhasasaṁharuḍu vām̐ḍe
sthirum̐ḍu sarvaguṇāgarum̐ḍu kodaṁḍadīkṣhā-
gurum̐ḍu sevagaśhubhagarum̐ḍu vām̐ḍe
(||rāmum̐||)
dhīrum̐ḍu logaigavīrum̐ḍu sagalā-
dhārum̐ḍu bhavabaṁdhadūrum̐ḍu vām̐ḍe
śhūrum̐ḍu dharmavisārum̐ḍu raghuvaṁśha-
sārum̐ḍu brahmasāgārum̐ḍu vām̐ḍe
(||rāmum̐||)
balum̐ḍu yinniḍā ravigulum̐ḍu bhāviṁcha ni-
rmalum̐ḍu niśhchalum̐ ḍavigalum̐ḍu vām̐ḍe
vĕlasi śhrīveṁkaḍādri vijanagaramulona
talagŏnĕm̐ buṇyabādadalum̐ḍu vām̐ḍe