(॥పల్లవి॥)
రాఁపులు సేయక ఇఁక రావయ్యా
మాపు దాఁకా మాటలేల మరి ఇఁక రావయ్యా
(॥రాఁపు॥)
కొచ్చి కొచ్చి సతిచేత కొలువుసేయించుకోఁగా
రచ్చకేక్కే వలపులు రావయ్యా
తచ్చి యాపె నిన్నుఁ బాసి తమకించీఁ బానుపుపై
నిచ్చట నేమిసే సేవు ఇఁక రావయ్యా
(॥రాఁవు॥)
ఆయనాయ జాగులేల అంగనఁ జూచితేను
రాయైనాఁ గరఁగును రావయ్యా
చేయి మీఁదాయ నీకును చెల్లెను పంతములెల్లా
కాయజుపై యాన నీకు గక్కన రావయ్యా
(॥రాఁపు॥)
సముకాన విన్నవించఁ జాలక చెలులచేత
రమణి విలువనంపె రావయ్యా
తమితో శ్రీవేంకటేశ తగవచ్చికే నేలితి
సమరతిఁ గూడ నిట్టే సంతతము రావయ్యా
(||pallavi||)
rām̐pulu seyaga im̐ka rāvayyā
mābu dām̐kā māḍalela mari im̐ka rāvayyā
(||rām̐pu||)
kŏchchi kŏchchi sadiseda kŏluvuseyiṁchugom̐gā
rachchagekke valabulu rāvayyā
tachchi yābĕ ninnum̐ bāsi tamagiṁchīm̐ bānububai
nichchaḍa nemise sevu im̐ka rāvayyā
(||rām̐vu||)
āyanāya jāgulela aṁganam̐ jūsidenu
rāyainām̐ garam̐gunu rāvayyā
seyi mīm̐dāya nīgunu sĕllĕnu paṁtamulĕllā
kāyajubai yāna nīgu gakkana rāvayyā
(||rām̐pu||)
samugāna vinnaviṁcham̐ jālaga sĕlulaseda
ramaṇi viluvanaṁpĕ rāvayyā
tamido śhrīveṁkaḍeśha tagavachchige nelidi
samaradim̐ gūḍa niṭṭe saṁtadamu rāvayyā