Raampu seyaga selulu raare meeru

రాఁపు సేయక చెలులు రారే మీరు
Language

(॥పల్లవి॥)
రాఁపు సేయక చెలులు రారే మీరు
యీపొద్దే మేలాయ్యీని యెడయ నే నోపను

(॥రాఁప॥)
వేసరుకోకరే మీరు విభుఁడే మన్నించీఁగాక
సేసవెట్టి పెండ్లాడి చిన్నఁబుచ్చీనా
ఆసలనెదురుచూచి అప్పటికి రాకుంటే
యీసరేఁగు వావిమీఁద నింతకు నే నోపను

(॥రాఁప॥)
తలపోఁత మనకేలే తానే వచ్చీగాని
పిలువనంపినవాఁడు బిగిశుండీనా
చలాలకుఁబెనఁగఁగా సరసము ఘనమైతే
అలుగవలయు వాని కంతకు నే నోపను

(॥రాఁప॥)
విన్నవించకురే మీరు వెలితి దీర్చీఁగాని
పన్ని నాకు బాసయిచ్చి పాడిదప్పీనా
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యెన్నగఁ వాని సొలయ ఇంతకు నే నోపను

(||pallavi||)
rām̐pu seyaga sĕlulu rāre mīru
yībŏdde melāyyīni yĕḍaya ne nobanu

(||rām̐pa||)
vesarugogare mīru vibhum̐ḍe manniṁchīm̐gāga
sesavĕṭṭi pĕṁḍlāḍi sinnam̐buchchīnā
āsalanĕdurusūsi appaḍigi rāguṁṭe
yīsarem̐gu vāvimīm̐da niṁtagu ne nobanu

(||rām̐pa||)
talabom̐ta managele tāne vachchīgāni
piluvanaṁpinavām̐ḍu bigiśhuṁḍīnā
salālagum̐bĕnam̐gam̐gā sarasamu ghanamaide
alugavalayu vāni kaṁtagu ne nobanu

(||rām̐pa||)
vinnaviṁchagure mīru vĕlidi dīrsīm̐gāni
panni nāgu bāsayichchi pāḍidappīnā
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
yĕnnagam̐ vāni sŏlaya iṁtagu ne nobanu