రాఁగదే యింటిలోనికి రాఁపు సేయక
(॥పల్లవి॥)
రాఁగదే యింటిలోనికి రాఁపు సేయక
చేఁగచూపుల మమ్మేల చిమ్మి రేఁచేవే
(॥రాఁగదే॥)
కూరిమి నెసరువెట్టి గుజ్జనగూళ్లు వండి
వేరులేని మాటలనే విందువెట్టేవే
నేరకే కా యింతేసి నీపాలఁ జిక్కితి నేను
యీరీతిచేఁతల మమ్మునేల బ్రమయించేవే
(॥రాఁగదే॥)
నగవుల వలవేసి నయముల ముద్దు చూపి
వెగటుఁగాఁకలనేల వేఁటలాడేవే
మొగమోటలనె కా నేమోసపోతి నీవల్ల
చిగురుఁజింతలనేల చివికించేవే
(॥రాఁగదే॥)
మరుతంత్రములనే మారువెల వెట్టి నన్ను
ధరలోన నింతయేల దక్కఁగొనేవే
యిరవై శ్రీవేంకటేశుఁడ నేఁ గూడితి
పెరరేఁచి యింకానేల పెనఁగించేవే
(||pallavi||)
rām̐gade yiṁṭilonigi rām̐pu seyaga
sem̐gasūbula mammela simmi rem̐seve
(||rām̐gade||)
kūrimi nĕsaruvĕṭṭi gujjanagūḽlu vaṁḍi
veruleni māḍalane viṁduvĕṭṭeve
nerage kā yiṁtesi nībālam̐ jikkidi nenu
yīrīdisem̐tala mammunela bramayiṁcheve
(||rām̐gade||)
nagavula valavesi nayamula muddu sūbi
vĕgaḍum̐gām̐kalanela vem̐ṭalāḍeve
mŏgamoḍalanĕ kā nemosabodi nīvalla
sigurum̐jiṁtalanela sivigiṁcheve
(||rām̐gade||)
marudaṁtramulane māruvĕla vĕṭṭi nannu
dharalona niṁtayela dakkam̐gŏneve
yiravai śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ gūḍidi
pĕrarem̐si yiṁkānela pĕnam̐giṁcheve