రాఁగదే యెక్కడిసుద్ది రమణుఁడున్నాడకు
(॥పల్లవి॥)
రాఁగదే యెక్కడిసుద్ది రమణుఁడున్నాడకు
పాఁగిన వోవరిలోనఁ బవళించున్నాడు
(॥రాగ॥)
తెరమఱఁగు దియ్యఁగా తీపులాయ వలపు
సరసములాడఁగానే చవులాయ మాఁటలు
తరితీపు శాయఁగానే తమకము రేఁగెను
యెరపుసేసుకవుంటే నెడలౌను పొందులు
(॥రాగ॥)
యెడమాఁట లాడఁగానే యియ్యకోలాయఁ బనులు
తొడిఁబడ నవ్వఁగానే దొరకెఁ గూటములు
వొడివట్టి తియ్యఁగానే వొళ్లెల్లాఁ జెమరించె
జడిసి వూరకేవుంటే చప్పనౌను వావులు
(॥రాగ॥)
యిచ్చకము శాయఁగానే యింపులు మిక్కిలిఁగల్లు
తచ్చి తచ్చి పెనఁగితే తగులాయమౌను
అచ్చపు శ్రీవేంకటేశుఁ డప్పుడే కూడె నిన్ను
మెచ్చి మెచ్చి పొందకున్న మీరుఁ జుట్టరికము
(||pallavi||)
rām̐gade yĕkkaḍisuddi ramaṇum̐ḍunnāḍagu
pām̐gina vovarilonam̐ bavaḽiṁchunnāḍu
(||rāga||)
tĕramaṟam̐gu diyyam̐gā tībulāya valabu
sarasamulāḍam̐gāne savulāya mām̐ṭalu
taridību śhāyam̐gāne tamagamu rem̐gĕnu
yĕrabusesugavuṁṭe nĕḍalaunu pŏṁdulu
(||rāga||)
yĕḍamām̐ṭa lāḍam̐gāne yiyyagolāyam̐ banulu
tŏḍim̐baḍa navvam̐gāne dŏragĕm̐ gūḍamulu
vŏḍivaṭṭi tiyyam̐gāne vŏḽlĕllām̐ jĕmariṁchĕ
jaḍisi vūragevuṁṭe sappanaunu vāvulu
(||rāga||)
yichchagamu śhāyam̐gāne yiṁpulu mikkilim̐gallu
tachchi tachchi pĕnam̐gide tagulāyamaunu
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍappuḍe kūḍĕ ninnu
mĕchchi mĕchchi pŏṁdagunna mīrum̐ juṭṭarigamu