రాఁగదె వో చెలియా రమణుఁడున్నాడకు
(॥పల్లవి॥)
రాఁగదె వో చెలియా రమణుఁడున్నాడకు
ఆఁగి నీచక్కఁదనాన కాసపడీ నిదివో
(॥రాఁగదె॥)
వలిపె పయ్యద నీవు వల్లెవాటు వేసుకోఁగా
వెలిఁబడె సిగ్గులెల్ల విచ్చనవిడి
అలవోకగా సొమ్ములట్టె నీవు నించుకోఁగ
మెలుపు జవ్వనానకు మెరుఁగెక్కెను
(॥రాఁగదె॥)
విరులు తురుమునిండ వెస నీవు ముడువఁగ
పెరిగెఁ జక్కఁదనము పెంటలుగాను
పరిమళములు నీవు పై పై నలఁదుకోఁగా
సురతగందములకు జోడుగూడెను
(॥రాఁగదె॥)
వెక్కసపు వేడుకతో విడెము నీవు సేయఁగ
యెక్కువ మోవిపండు యెఱ్ఱఁగా మాఁగె
అక్కరతో శ్రీ వెంకటాధిపునిఁ బెండ్లాడఁగ
తక్కక మనసుకవి తలపోఁతలాయను
(||pallavi||)
rām̐gadĕ vo sĕliyā ramaṇum̐ḍunnāḍagu
ām̐gi nīsakkam̐danāna kāsabaḍī nidivo
(||rām̐gadĕ||)
valibĕ payyada nīvu vallĕvāḍu vesugom̐gā
vĕlim̐baḍĕ siggulĕlla vichchanaviḍi
alavogagā sŏmmulaṭṭĕ nīvu niṁchugom̐ga
mĕlubu javvanānagu mĕrum̐gĕkkĕnu
(||rām̐gadĕ||)
virulu turumuniṁḍa vĕsa nīvu muḍuvam̐ga
pĕrigĕm̐ jakkam̐danamu pĕṁṭalugānu
parimaḽamulu nīvu pai pai nalam̐dugom̐gā
suradagaṁdamulagu joḍugūḍĕnu
(||rām̐gadĕ||)
vĕkkasabu veḍugado viḍĕmu nīvu seyam̐ga
yĕkkuva movibaṁḍu yĕṭram̐gā mām̐gĕ
akkarado śhrī vĕṁkaḍādhibunim̐ bĕṁḍlāḍam̐ga
takkaga manasugavi talabom̐talāyanu