రాఁగదే నీవొప్పు రమణుని కిట్టె
(॥పల్లవి॥)
రాఁగదే నీవొప్పు రమణుని కిట్టె
చేఁగలు దేరియు చిగురాయనే
(॥రాఁగ॥)
చెక్కులచేతఁత(చేతు?)లు సిగ్గుల మొక్కులు
అక్కరతో నీకమరెనే
అక్కజమై పతి కవి చూడఁజూడ
తక్కక తలపోఁతలై మించెనే
(॥రాఁగ॥)
పలచనినవ్వులు పయ్యదకప్పులు
చెలియ నీకైతేసింగారమే
నెలవై నీవిభునికి నివియెల్లా
అలరి సందించి ఆసలాయనే
(॥రాఁగ॥)
కారేటిచెమటలు కాఁగిలింపులును
నేరుపుతోడుత నీభాగ్యమే
యీరీతి శ్రీవేంకటేశ్వరుని కివి
పారపురతికిఁ జవులై వున్నవే
(||pallavi||)
rām̐gade nīvŏppu ramaṇuni kiṭṭĕ
sem̐galu deriyu sigurāyane
(||rām̐ga||)
sĕkkulasedam̐ta(sedu?)lu siggula mŏkkulu
akkarado nīgamarĕne
akkajamai padi kavi sūḍam̐jūḍa
takkaga talabom̐talai miṁchĕne
(||rām̐ga||)
palasaninavvulu payyadagappulu
sĕliya nīgaidesiṁgārame
nĕlavai nīvibhunigi niviyĕllā
alari saṁdiṁchi āsalāyane
(||rām̐ga||)
kāreḍisĕmaḍalu kām̐giliṁpulunu
nerubudoḍuda nībhāgyame
yīrīdi śhrīveṁkaḍeśhvaruni kivi
pāraburadigim̐ javulai vunnave