Raamgadave annidaanu ravvayidimi

రాఁగదవే అన్నిటాను రవ్వయితిమి
Language

(॥పల్లవి॥)
రాఁగదవే అన్నిటాను రవ్వయితిమి
కాఁగిన కాఁకలచేతఁ గరివడె నిపుడు

(॥రాగ॥)
సాదించేవు నీ కాతఁడు చాయలకు వచ్చీనా
వాదించేవు నీ కాతఁడు వలచీనా
ఆదిగొని చెలులెల్ల నట్టె పైపైఁ బడఁగాను
గాదిలియాతనిమది కాయగాచె నిపుడు

(॥రాగ॥)
చెనకే వాతఁడు నీచెప్పినట్టు సేసీనా
పెనఁగే వాతఁ డందుకు ప్రియపడీనా
వనితలందరు వచ్చి వద్దనే వుండఁగాను
చనుమానముల మొగచాటాయ నిపుడు

(॥రాగ॥)
యేకతానకు దీసేవు యింతలోనే లోనయ్యీనా
పైకొని కూడితి వట్టె బాఁతిపడి
శ్రీకాంత వురమెక్కిన శ్రీవేంకటేశుఁ డితఁడు
మైకొని వురమెల్లాను మట్టుపడె నిపుడు

(||pallavi||)
rām̐gadave anniḍānu ravvayidimi
kām̐gina kām̐kalasedam̐ garivaḍĕ nibuḍu

(||rāga||)
sādiṁchevu nī kādam̐ḍu sāyalagu vachchīnā
vādiṁchevu nī kādam̐ḍu valasīnā
ādigŏni sĕlulĕlla naṭṭĕ paibaim̐ baḍam̐gānu
gādiliyādanimadi kāyagāsĕ nibuḍu

(||rāga||)
sĕnage vādam̐ḍu nīsĕppinaṭṭu sesīnā
pĕnam̐ge vādam̐ ḍaṁdugu priyabaḍīnā
vanidalaṁdaru vachchi vaddane vuṁḍam̐gānu
sanumānamula mŏgasāḍāya nibuḍu

(||rāga||)
yegadānagu dīsevu yiṁtalone lonayyīnā
paigŏni kūḍidi vaṭṭĕ bām̐tibaḍi
śhrīgāṁta vuramĕkkina śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
maigŏni vuramĕllānu maṭṭubaḍĕ nibuḍu