రాఁడంటా నుంటివి రమణుఁడు నీవద్దికి
(॥పల్లవి॥)
రాఁడంటా నుంటివి రమణుఁడు నీవద్దికి
పోఁడిమి నీ సకినా లిప్పుడు నిజమాయెను
(॥॥)
చెక్కిటిచెయ్యేఁటికే చిత్తపునుయ్యేఁటికే
నిక్కిచూడవే పతి నిలుచున్నాఁడు
మొక్కవే చేతులెత్తి మొగము చూచీ నతఁడు
నిక్కలలాయ నేఁడు నీవుగన్నకలలు
(॥॥)
సిగ్గులకరఁగులేలే చెలులమరఁగులేలే
వొగ్గి కొలువసేయవే వొంటినున్నాడు
దగ్గరి యెదురుకోవే తానే వచ్చీ నతఁడు
బగ్గన నీనోములెల్ల ఫలియించె నవిగొ
(॥॥)
నెలవాఁత లిదియేమే నీతలపోఁత లిదేమే
యేలుమనవే శ్రీవేంకటేశుఁ డున్నాఁడు
మేలమాడవే అలమేలుమంగ వాతఁ డేలె
కోలుముందై తలకూడె కోరిన కోరికలు
(||pallavi||)
rām̐ḍaṁṭā nuṁṭivi ramaṇum̐ḍu nīvaddigi
pom̐ḍimi nī saginā lippuḍu nijamāyĕnu
(||||)
sĕkkiḍisĕyyem̐ṭige sittabunuyyem̐ṭige
nikkisūḍave padi nilusunnām̐ḍu
mŏkkave sedulĕtti mŏgamu sūsī nadam̐ḍu
nikkalalāya nem̐ḍu nīvugannagalalu
(||||)
siggulagaram̐gulele sĕlulamaram̐gulele
vŏggi kŏluvaseyave vŏṁṭinunnāḍu
daggari yĕdurugove tāne vachchī nadam̐ḍu
baggana nīnomulĕlla phaliyiṁchĕ navigŏ
(||||)
nĕlavām̐ta lidiyeme nīdalabom̐ta lideme
yelumanave śhrīveṁkaḍeśhum̐ ḍunnām̐ḍu
melamāḍave alamelumaṁga vādam̐ ḍelĕ
kolumuṁdai talagūḍĕ korina korigalu