Raamdaaya nadam dimdu raampulane poddu voya

రాఁడాయ నతఁ డిందు రాఁపులనె పొద్దు వోయ
Language

(॥పల్లవి॥)
రాఁడాయ నతఁ డిందు రాఁపులనె పొద్దు వోయ
యేఁడాయ నిమిషము ఇంతలోనే చెలియా

(॥రాఁడా॥)
కలతునొకొ పతిఁ గాఁగిట నొకపరి
తలఁచునొకొ నన్నుఁ దా నతఁడు
పిలిచి యాతఁడు నాతోఁ బ్రియమున నవ్వెనంటా
కలలోన వేగుదాఁకాఁ గంటినే వోచెలియా

(॥రాఁడా॥)
ముచ్చటలాడుదునొకొ మోముచూచి పతితోను
చెచ్చెర నాతఁ డందేమి సేసీనొకొ
గచుల్చనాకన్నులకుఁ గట్టినట్లు తనమేను
పచ్చిదోఁచ నామదిఁ బాయఁడే వోచెలియా

(॥రాఁడా॥)
నేతునొకొ సేయఁగల సేఁతలెల్లా నాతనిపై
యేతల దాఁగివున్నాఁడో యీడనే తాను
చేతులు మూసి కూడెను శ్రీ వేంకటేశుఁడు నన్ను
యీతలఁ బాయఁ డిఁకను యిందాఁకా జెలి

(||pallavi||)
rām̐ḍāya nadam̐ ḍiṁdu rām̐pulanĕ pŏddu voya
yem̐ḍāya nimiṣhamu iṁtalone sĕliyā

(||rām̐ḍā||)
kaladunŏgŏ padim̐ gām̐giḍa nŏgabari
talam̐sunŏgŏ nannum̐ dā nadam̐ḍu
pilisi yādam̐ḍu nādom̐ briyamuna navvĕnaṁṭā
kalalona vegudām̐kām̐ gaṁṭine vosĕliyā

(||rām̐ḍā||)
muchchaḍalāḍudunŏgŏ momusūsi padidonu
sĕchchĕra nādam̐ ḍaṁdemi sesīnŏgŏ
gasulsanāgannulagum̐ gaṭṭinaṭlu tanamenu
pachchidom̐sa nāmadim̐ bāyam̐ḍe vosĕliyā

(||rām̐ḍā||)
nedunŏgŏ seyam̐gala sem̐talĕllā nādanibai
yedala dām̐givunnām̐ḍo yīḍane tānu
sedulu mūsi kūḍĕnu śhrī veṁkaḍeśhum̐ḍu nannu
yīdalam̐ bāyam̐ ḍim̐kanu yiṁdām̐kā jĕli