రామనుఁ గనుఁగొంటేఁ గరఁగు ఱాయి యైనాను
(॥పల్లవి॥)
రామనుఁ గనుఁగొంటేఁ గరఁగు ఱాయి యైనాను
ఆముకొని సేవ సేసి నాదరించవలదా
(॥రామను॥)
సరిఁ జెక్కుచెమటలు చన్నులపైఁ జిందఁగాను
తరుణి నీ కిందాఁకాఁ బాదము లొత్తెను
పొరిఁబొరి నిట్టూర్పులు పుక్కిళ్ళ నించుకొంటాను
యిరవుగాఁ జామరము లిందాఁకా విసరెను
(॥రామను॥)
వింతగాఁ గొప్పువిరులు వీఁపువెంటా రాలఁగాను
యింతవడి నాలవట్ట మిడె నీకును
కొంత గొంత పోఁకముడి కుచ్చలతో జాఱఁగాను
వంతుకు నీమేన జవ్వాది పూసె నీడను
(॥రామను॥)
కాంచి తనతనువునఁబులకలు నిండఁగాను
మంచముపై నీకు నాకు మడిచి చ్చెను
యెంచఁగ శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
మించి నన్నూఁ గూడితివి మెచ్చీఁ దా నిపుడు
(||pallavi||)
rāmanum̐ ganum̐gŏṁṭem̐ garam̐gu ṟāyi yainānu
āmugŏni seva sesi nādariṁchavaladā
(||rāmanu||)
sarim̐ jĕkkusĕmaḍalu sannulabaim̐ jiṁdam̐gānu
taruṇi nī kiṁdām̐kām̐ bādamu lŏttĕnu
pŏrim̐bŏri niṭṭūrbulu pukkiḽḽa niṁchugŏṁṭānu
yiravugām̐ jāmaramu liṁdām̐kā visarĕnu
(||rāmanu||)
viṁtagām̐ gŏppuvirulu vīm̐puvĕṁṭā rālam̐gānu
yiṁtavaḍi nālavaṭṭa miḍĕ nīgunu
kŏṁta gŏṁta pom̐kamuḍi kuchchalado jāṟam̐gānu
vaṁtugu nīmena javvādi pūsĕ nīḍanu
(||rāmanu||)
kāṁchi tanadanuvunam̐bulagalu niṁḍam̐gānu
maṁchamubai nīgu nāgu maḍisi schĕnu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yī yalamelumaṁganu
miṁchi nannūm̐ gūḍidivi mĕchchīm̐ dā nibuḍu