రామలకు సహజమే రమణుఁడు నేమిసేసు
(॥పల్లవి॥)
రామలకు సహజమే రమణుఁడు నేమిసేసు
మోములు చూచుకొందుము మోనానఁ జెలులము
(॥రామ॥)
పూఁచినట్టి చేతిమొక్కు పురుషునిమీఁదను
చాఁచిన వెంగేలేల(ల్ల) సవతి మీఁద
తూఁచి చల్లీ నొక్కమాఁటే తొయ్యలి ఇద్దరిమీఁద
దాఁచుకొనీ వెడనవ్వు తా నడుమ నాతఁడే
(॥రామ॥)
కానుక తామెరపువ్వు ఘనుఁడుప్రాణేశునికి
సానఁబట్టినట్టి చూపు సవతికిని
ఆనించీ నిద్దరికిని అంగనఁ దానొక్కమాఁటే
నానవేసీ వలపులు నడుమ దా నతఁడే
(॥రామ॥)
చిందేటి మోవితేనె శ్రీ వేంకటేశ్వరునికి
సందడిఁగాకుండఁ దెర సవతికిని
పొందు సే సె నొకమాటే పొత్తుల నిద్దరికిని
మందలించీ నడుమను మాఁటలనే ఆతఁడు
(||pallavi||)
rāmalagu sahajame ramaṇum̐ḍu nemisesu
momulu sūsugŏṁdumu monānam̐ jĕlulamu
(||rāma||)
pūm̐sinaṭṭi sedimŏkku puruṣhunimīm̐danu
sām̐sina vĕṁgelela(lla) savadi mīm̐da
tūm̐si sallī nŏkkamām̐ṭe tŏyyali iddarimīm̐da
dām̐sugŏnī vĕḍanavvu tā naḍuma nādam̐ḍe
(||rāma||)
kānuga tāmĕrabuvvu ghanum̐ḍuprāṇeśhunigi
sānam̐baṭṭinaṭṭi sūbu savadigini
āniṁchī niddarigini aṁganam̐ dānŏkkamām̐ṭe
nānavesī valabulu naḍuma dā nadam̐ḍe
(||rāma||)
siṁdeḍi movidenĕ śhrī veṁkaḍeśhvarunigi
saṁdaḍim̐gāguṁḍam̐ dĕra savadigini
pŏṁdu se sĕ nŏgamāḍe pŏttula niddarigini
maṁdaliṁchī naḍumanu mām̐ṭalane ādam̐ḍu