రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
(॥పల్లవి॥)
రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
దీమువంటి బంట ననే తేజమే నాది
(॥రామ॥)
వారిధి దాఁటి మెప్పించ వాయుజుడ నేఁ గాను
సారెఁ జవుల మెప్పించ శబరిఁగాను
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుఁడఁగాను
యేరీతి మెప్పింతు నన్ను యెట్లఁ గాచేవో
(॥రామ॥)
ఘనమై మోచి మోప్పించ గరుడుఁడ నేఁ గాను
కొనఁ గామసుఖ మిచ్చు గోపికఁ గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ల భోగిఁ గాను
నినునెట్లు మెప్పింతు ననుఁగాచేదెట్లా
(॥రామ॥)
నవ్వుచుఁ బాడి మెప్పించ నారదుఁడ నేఁగాను
అవ్వలఁ బ్రాణ మియ్య జటాయువు గాను
యివ్వల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
రవ్వల నా తెరు విదె రక్షించే దెట్లో
(||pallavi||)
rāma rāma rāmakṛṣhṇa rājīvalosana nīgu
dīmuvaṁṭi baṁṭa nane tejame nādi
(||rāma||)
vāridhi dām̐ṭi mĕppiṁcha vāyujuḍa nem̐ gānu
sārĕm̐ javula mĕppiṁcha śhabarim̐gānu
bīrāna sīda nichchi mĕppiṁcha janagum̐ḍam̐gānu
yerīdi mĕppiṁtu nannu yĕṭlam̐ gāsevo
(||rāma||)
ghanamai mosi moppiṁcha garuḍum̐ḍa nem̐ gānu
kŏnam̐ gāmasukha michchu gobigam̐ gānu
vinudiṁchi mĕppiṁcha veyinoḽla bhogim̐ gānu
ninunĕṭlu mĕppiṁtu nanum̐gāsedĕṭlā
(||rāma||)
navvusum̐ bāḍi mĕppiṁcha nāradum̐ḍa nem̐gānu
avvalam̐ brāṇa miyya jaḍāyuvu gānu
yivvala śhrīveṁkaḍeśha yiḍu nīge śharaṇaṁṭi
ravvala nā tĕru vidĕ rakṣhiṁche dĕṭlo