Raaju bojumgai gaajum gadiya maada raama raama kadusodyamuloo

రాజు బొజుఁగై గాజుఁ గడియ మాట రామ రామ కడుసోద్యములూ
Language

(॥పల్లవి॥)
రాజు బొజుఁగై గాజుఁ గడియ మాట రామ రామ కడుసోద్యములూ
తేజముతోడుత దీపము పట్టుక తెలియక చీఁకటి దవ్వెదరు

(॥రా॥)
దైవము గలఁడట తానె నమ్మెనట తనకు పురాకృత మెక్కడి
భావములోపల నమ్మని కడమల సాపమింతే కాక
యేవలఁ జూచిన స్వతంత్రుఁడగు హరి యెట్టు సేసినా నట్టేను
ఆపల నాతనిమఱఁగు జొచ్చితిని అపరాధంబులు మఱి కలవా

(॥రా॥)
పురుషోత్తముఁడట తన్ను నేవీనట పుణ్యము లింకా వెదకెడిదా
యిరవుగ నెఱుఁగని అజ్ఞానపు తన యెడ్డతనము గాక
ఆరయఁగ నాతఁడు సర్వేశ్వరుఁడట అన్నిటికినిఁ దా నేరఁడా
విరసపుటనుమానము లిఁకనేటికి వెఱపులుమెఱపులు మఱికలవా

(॥రా॥)
శ్రీవేంకటపతి అంతరాత్మ యట చింతలుసిలుగులు యెక్కడివి
ఆవటించి మతిఁదెలియనికడమల ఆజ్ఞానము గాక
శ్రీ విభుడీతఁడె యెంచి చూచినను సృష్టి కెల్ల రక్షకుఁడు
కైవసమాయను మాకు నితఁడిదె కడమలు దొడమలు మఱి కలవా

(||pallavi||)
rāju bŏjum̐gai gājum̐ gaḍiya māḍa rāma rāma kaḍusodyamulū
tejamudoḍuda dībamu paṭṭuga tĕliyaga sīm̐kaḍi davvĕdaru

(||rā||)
daivamu galam̐ḍaḍa tānĕ nammĕnaḍa tanagu purākṛta mĕkkaḍi
bhāvamulobala nammani kaḍamala sābamiṁte kāga
yevalam̐ jūsina svadaṁtrum̐ḍagu hari yĕṭṭu sesinā naṭṭenu
ābala nādanimaṟam̐gu jŏchchidini abarādhaṁbulu maṟi kalavā

(||rā||)
puruṣhottamum̐ḍaḍa tannu nevīnaḍa puṇyamu liṁkā vĕdagĕḍidā
yiravuga nĕṟum̐gani ajñānabu tana yĕḍḍadanamu gāga
ārayam̐ga nādam̐ḍu sarveśhvarum̐ḍaḍa anniḍiginim̐ dā neram̐ḍā
virasabuḍanumānamu lim̐kaneḍigi vĕṟabulumĕṟabulu maṟigalavā

(||rā||)
śhrīveṁkaḍabadi aṁtarātma yaḍa siṁtalusilugulu yĕkkaḍivi
āvaḍiṁchi madim̐dĕliyanigaḍamala ājñānamu gāga
śhrī vibhuḍīdam̐ḍĕ yĕṁchi sūsinanu sṛṣhṭi kĕlla rakṣhagum̐ḍu
kaivasamāyanu māgu nidam̐ḍidĕ kaḍamalu dŏḍamalu maṟi kalavā