(॥పల్లవి॥)
రాజీవనేత్రాయ రాఘవాయ నమో
సౌజన్యనిలయాయ జానకీశాయ*
(॥రాజీ॥)
దశరథతనూజాయ తాటకదమనాయ
కుశికసంభవయజ్ఞగోపనాయ
పశుపతిమహాధనుర్భంజనాయ నమో
విశదభార్గవరామవిజయకరణాయ
(॥రాజీ॥)
భరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ
ఖరదూషణాది రిపుఖండనాయ
తరణిసంభవసైన్యదక్షకాయ నమో
నిరుపమమహావారినిధిబంధనాయ
(॥రాజీ॥)
హతరావణాయ సంయమినాథవరదాయ
అతులితాయోధ్యాపురాధిపాయ
హితకర శ్రీవేంకటేశ్వరాయ నమో
వితతవావిలిపాటి వీరరామాయ
(||pallavi||)
rājīvanetrāya rāghavāya namo
saujanyanilayāya jānagīśhāya*
(||rājī||)
daśharathadanūjāya tāḍagadamanāya
kuśhigasaṁbhavayajñagobanāya
paśhubadimahādhanurbhaṁjanāya namo
viśhadabhārgavarāmavijayagaraṇāya
(||rājī||)
bharidadharmāya śhūrbaṇakhāṁgaharaṇāya
kharadūṣhaṇādi ribukhaṁḍanāya
taraṇisaṁbhavasainyadakṣhagāya namo
nirubamamahāvārinidhibaṁdhanāya
(||rājī||)
hadarāvaṇāya saṁyamināthavaradāya
adulidāyodhyāburādhibāya
hidagara śhrīveṁkaḍeśhvarāya namo
vidadavāvilibāḍi vīrarāmāya