(॥పల్లవి॥)
రాజసమే ఘనమాయ రాఁగా రాఁగా
వోజ దప్పవచ్చునా నీ వువిదల యెడకు
(॥రాజ॥)
చెక్కుల చెమట గారె సేసకొప్పు వెడ జారె
వెక్కసాన యింతిని నవ్వించఁగాను
లక్కవలెఁ గరగె యీలాగు చూచి నామనసు
క్కకసీఁడ వయితివిగా కాంతల యెడకు-
(॥రాజ॥)
కాయమెల్లాఁ బులకించె గడు నివ్వెరగు ముంచె
చేయి చేయిఁ బట్టి చెలి చెనకఁగాను
యీ యతివఁ జూచి నీపై నెంతైనాఁ గోపము వచ్చె
మాయదారి వైతివిగా మగువల యెడకు
(॥రాజ॥)
కన్నులకుఁ గెంపలెక్కె కాంత నీపాలిటఁ జిక్కె
వున్నతిఁ గాఁగిటఁ గూడి వుండఁగాను
మన్నన శ్రీవేంకటేశ మాకు నొక్క మనసాయ
అన్నిట జాణవైతిగా అతివల యెడకు
(||pallavi||)
rājasame ghanamāya rām̐gā rām̐gā
voja dappavachchunā nī vuvidala yĕḍagu
(||rāja||)
sĕkkula sĕmaḍa gārĕ sesagŏppu vĕḍa jārĕ
vĕkkasāna yiṁtini navviṁcham̐gānu
lakkavalĕm̐ garagĕ yīlāgu sūsi nāmanasu
kkagasīm̐ḍa vayidivigā kāṁtala yĕḍagu-
(||rāja||)
kāyamĕllām̐ bulagiṁchĕ gaḍu nivvĕragu muṁchĕ
seyi seyim̐ baṭṭi sĕli sĕnagam̐gānu
yī yadivam̐ jūsi nībai nĕṁtainām̐ gobamu vachchĕ
māyadāri vaidivigā maguvala yĕḍagu
(||rāja||)
kannulagum̐ gĕṁpalĕkkĕ kāṁta nībāliḍam̐ jikkĕ
vunnadim̐ gām̐giḍam̐ gūḍi vuṁḍam̐gānu
mannana śhrīveṁkaḍeśha māgu nŏkka manasāya
anniḍa jāṇavaidigā adivala yĕḍagu