Raajasabuvaani nimta ravvaseduraa

రాజసపువాని నింత రవ్వసేతురా
Language

(॥పల్లవి॥)
రాజసపువాని నింత రవ్వసేతురా
వోజతో గుట్టుసేసుక వుండవలెఁగాక

(॥॥)
కెలసి నీవిభుఁడు నీకే వలచునంటాను
చెలులతోనెల్లాను చెప్పుకొనేవే
తొలుత నతఁడు నీపొత్తున నారగించెనంటా
చెలరేఁగి సంతోసానఁ జిమ్మిరేఁగేవే

(॥॥)
వొగ్గి యాతఁడప్పటి నీవొడివట్టి తీసెనంటా
సిగ్గువిడిచాతనిపైఁ జేయివేతురా
యెగ్గుపట్ట కెప్పుడూ నీయిచ్చలోనే వచ్చునంటా
వెగ్గళించి సరసము వేమారు నాడుదురా

(॥॥)
యీతఁడు శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
నాతో నవ్వెనంటాను నీలుగనేలే
ఆతుమగా నన్నునేలె ఆ నీకు నిచ్చెనంటా
కాతరించి యిటువలెఁగాకు సేయనేలే

(||pallavi||)
rājasabuvāni niṁta ravvasedurā
vojado guṭṭusesuga vuṁḍavalĕm̐gāga

(||||)
kĕlasi nīvibhum̐ḍu nīge valasunaṁṭānu
sĕluladonĕllānu sĕppugŏneve
tŏluda nadam̐ḍu nībŏttuna nāragiṁchĕnaṁṭā
sĕlarem̐gi saṁtosānam̐ jimmirem̐geve

(||||)
vŏggi yādam̐ḍappaḍi nīvŏḍivaṭṭi tīsĕnaṁṭā
sigguviḍisādanibaim̐ jeyivedurā
yĕggubaṭṭa kĕppuḍū nīyichchalone vachchunaṁṭā
vĕggaḽiṁchi sarasamu vemāru nāḍudurā

(||||)
yīdam̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
nādo navvĕnaṁṭānu nīluganele
ādumagā nannunelĕ ā nīgu nichchĕnaṁṭā
kādariṁchi yiḍuvalĕm̐gāgu seyanele