రాజపు నీకెదురేది రామచంద్ర
(॥పల్లవి॥)
రాజపు నీకెదురేది రామచంద్ర
రాజీవనయనుఁడ రామచంద్ర
(॥॥)
వెట్టిగాదునీవలపు వింటి నారికిఁ దెచ్చితివి
ఱట్టుసేయఁ బనిలేదు యిట్టె రామచంద్ర
గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి-
వెట్టు మఱవఁగవచ్చు నివి రామచంద్ర
(॥॥)
బతిమితోడుతఁ బైఁడిపతిమెఁ గై కొంటివి
రతికెక్కె నీచలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీఁదుకట్టితివి నాకై
యితరు లేమనఁగల రిఁక రామచంద్ర
(॥॥)
నావంటిసీతను నాఁగేటికొనఁ దెచ్చితి
రావాడితమకముతో రామచంద్ర
యీవేళ శ్రీ వేంకటాద్రి నిరవై నన్నుఁ గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర
(||pallavi||)
rājabu nīgĕduredi rāmasaṁdra
rājīvanayanum̐ḍa rāmasaṁdra
(||||)
vĕṭṭigādunīvalabu viṁṭi nārigim̐ dĕchchidivi
ṟaṭṭuseyam̐ baniledu yiṭṭĕ rāmasaṁdra
guṭṭudoḍa jalanidhibai gŏṁḍalu muḍivesidi-
vĕṭṭu maṟavam̐gavachchu nivi rāmasaṁdra
(||||)
badimidoḍudam̐ baim̐ḍibadimĕm̐ gai kŏṁṭivi
radigĕkkĕ nīsalamu rāmasaṁdra
midimīri javvanamu mīm̐dugaṭṭidivi nāgai
yidaru lemanam̐gala rim̐ka rāmasaṁdra
(||||)
nāvaṁṭisīdanu nām̐geḍigŏnam̐ dĕchchidi
rāvāḍidamagamudo rāmasaṁdra
yīveḽa śhrī veṁkaḍādri niravai nannum̐ gūḍidi
sevadera gaṁḍigoḍa śhrīrāmasaṁdra