రాకు రాకు నీ వంత రవ్వసేయను
(॥పల్లవి॥)
రాకు రాకు నీ వంత రవ్వసేయను
చేకొని పంతముల నాచేతిగోర నున్నవి
(॥రాకు॥)
చలము సాదించఁగానె సరసములాడైన
నలయించకేలమానే నాసుద్దికి
నిలువున వినయాలు నీవెంత సేసినాను
కులికి నా కోపము గుండెలోనే వున్నది
(॥రాకు॥)
గుఱిగా నలుగఁగాని గుంపెనమొక్కులనైన
యెఱిఁగించే నీగుణాలు యీ నీ చేఁతకు
తఱితోడ నీవెంత దయవుట్టఁ బెనఁగినా
మఱియును బీరాలు మా పెదవి నున్నవి
(॥రాకు॥)
కొసరి నే దిట్టఁగాని కూడినకూటమినైన
పసచూపే నీ మోహపు పంతములకు
యెసగి శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గలసితి
వసదు నీ వలపు నా ఆతుమలో నున్నది
(||pallavi||)
rāgu rāgu nī vaṁta ravvaseyanu
segŏni paṁtamula nāsedigora nunnavi
(||rāgu||)
salamu sādiṁcham̐gānĕ sarasamulāḍaina
nalayiṁchagelamāne nāsuddigi
niluvuna vinayālu nīvĕṁta sesinānu
kuligi nā kobamu guṁḍĕlone vunnadi
(||rāgu||)
guṟigā nalugam̐gāni guṁpĕnamŏkkulanaina
yĕṟim̐giṁche nīguṇālu yī nī sem̐tagu
taṟidoḍa nīvĕṁta dayavuṭṭam̐ bĕnam̐ginā
maṟiyunu bīrālu mā pĕdavi nunnavi
(||rāgu||)
kŏsari ne diṭṭam̐gāni kūḍinagūḍaminaina
pasasūbe nī mohabu paṁtamulagu
yĕsagi śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ galasidi
vasadu nī valabu nā ādumalo nunnadi