Raadire seppiyampidi rammanave

రాతిరే చెప్పియంపితి రమ్మనవే
Language

(॥పల్లవి॥)
రాతిరే చెప్పియంపితి రమ్మనవే
యేతులు పచరించఁగ నిఁకనేలే

(॥రాతి॥)
మనసు మర్మము సోఁకె మాటలెల్లఁ దేటలాయ
తనకు నాకిఁక వేరే తగవేలే
వెనకటి సుద్దు లవి వింతవింతలాగు లివి
తనిసితి నన్నిటాను తారుకాణలేలే

(॥రాతి॥)
చూపులు రూపై నిలిచె సూట్లు వాఁటాన కెక్కె
వోపిక లిద్దరివాయ వొట్లేలే
తీపులపైఁ దీపు తొల్లి తేనెలపై తేనే, నేఁడు
యీపసన నే నెఱుఁగుదు యెచ్చరించనేలే

(॥రాతి॥)
తనువులు జంటలాయ తమకము పెంటలాయ
చనవిచ్చెఁ దా నాకు సటలేలే
వినుకలాయ నప్పుడు కనుకలాయ నిప్పుడు
యెనసె శ్రీ వేంకటేశుఁ డింకా నేలే

(||pallavi||)
rādire sĕppiyaṁpidi rammanave
yedulu pasariṁcham̐ga nim̐kanele

(||rādi||)
manasu marmamu som̐kĕ māḍalĕllam̐ deḍalāya
tanagu nāgim̐ka vere tagavele
vĕnagaḍi suddu lavi viṁtaviṁtalāgu livi
tanisidi nanniḍānu tārugāṇalele

(||rādi||)
sūbulu rūbai nilisĕ sūṭlu vām̐ṭāna kĕkkĕ
vobiga liddarivāya vŏṭlele
tībulabaim̐ dību tŏlli tenĕlabai tene, nem̐ḍu
yībasana ne nĕṟum̐gudu yĕchchariṁchanele

(||rādi||)
tanuvulu jaṁṭalāya tamagamu pĕṁṭalāya
sanavichchĕm̐ dā nāgu saḍalele
vinugalāya nappuḍu kanugalāya nippuḍu
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁkā nele