Puvvuvalem gaamgilimchi bhogimchavalem gaaga

పువ్వువలెఁ గాఁగిలించి భోగించవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
పువ్వువలెఁ గాఁగిలించి భోగించవలెఁ గాక
కావరానఁ జెలి నింత గాసిగాఁ జేతురా

(॥పువ్వు॥)
చక్కనిరమణి నీసంగడికి వచ్చితేను
చెక్కులు గిల్లుదురా చెల్లఁబో నీవు
జక్కవచన్నులు నీకు సరిమొన చూపెనంటా
కిక్కిరినఁ జేతఁబట్టి గిజిగిజి సేతురా

(॥పువ్వు॥)
కడుఁగోమలపుపతి కదిసి పాదా లొత్తితే
వొడివట్టి తితురా వొహో నీవు
అడరి మోవిపండు నీ కటు నోరూరించెనంటా
పిడిచి యధర మింత పిప్పిసేతురా

(॥పువ్వు॥)
సింగారించుకొని లేమ సేస నీపైఁ బెట్టితేను
అంగ మింతబిగింతురా ఆహా నీవు
అంగజునిదీము లాచీ ననుచు శ్రీవేంకటేశ
వుంగిటిరతులఁ గూడి వుమ్మగిలసేతురా

(||pallavi||)
puvvuvalĕm̐ gām̐giliṁchi bhogiṁchavalĕm̐ gāga
kāvarānam̐ jĕli niṁta gāsigām̐ jedurā

(||puvvu||)
sakkaniramaṇi nīsaṁgaḍigi vachchidenu
sĕkkulu gilludurā sĕllam̐bo nīvu
jakkavasannulu nīgu sarimŏna sūbĕnaṁṭā
kikkirinam̐ jedam̐baṭṭi gijigiji sedurā

(||puvvu||)
kaḍum̐gomalabubadi kadisi pādā lŏttide
vŏḍivaṭṭi tidurā vŏho nīvu
aḍari movibaṁḍu nī kaḍu norūriṁchĕnaṁṭā
piḍisi yadhara miṁta pippisedurā

(||puvvu||)
siṁgāriṁchugŏni lema sesa nībaim̐ bĕṭṭidenu
aṁga miṁtabigiṁturā āhā nīvu
aṁgajunidīmu lāsī nanusu śhrīveṁkaḍeśha
vuṁgiḍiradulam̐ gūḍi vummagilasedurā