పువ్వుఁబోణుల కొలువే పుష్పయాగము
(॥పల్లవి॥)
పువ్వుఁబోణుల కొలువే పుష్పయాగము
పువ్వక పూచె నీకిట్టే పుష్పయాగము
(॥పవ్వు॥)
కలువరేకులవంటి ఘనమైన కన్నుల
పొలఁతులచూపులే నీ పుష్పయాగము
తలఁచి తలఁచి నిన్నుఁ దమమేనులఁ బొడమే
పులక జొంపములే నీ పుష్పయాగము
(॥పవ్వు॥)
కరకమలములను కందువ గోపికలెల్లా
పొరసి నిన్నుఁ జూపుటే పుష్పయాగము
సరసపుమాటలే సారె నాడి తమ నవ్వు
పొరి నీపైఁ జల్లుటే పుష్పయాగము
(॥పవ్వు॥)
గాఁటపుఁగొలనిదండఁ గాంతలు సిగ్గున నిన్ను
బూటకానకుఁ దిట్టుటే పుష్పయాగము
యీటువ శ్రీవేంకటేశ యిట్టె యలమేలుమంగ
పూఁట పూట రతు లివి పుష్పయాగము
(||pallavi||)
puvvum̐boṇula kŏluve puṣhpayāgamu
puvvaga pūsĕ nīgiṭṭe puṣhpayāgamu
(||pavvu||)
kaluvaregulavaṁṭi ghanamaina kannula
pŏlam̐tulasūbule nī puṣhpayāgamu
talam̐si talam̐si ninnum̐ damamenulam̐ bŏḍame
pulaga jŏṁpamule nī puṣhpayāgamu
(||pavvu||)
karagamalamulanu kaṁduva gobigalĕllā
pŏrasi ninnum̐ jūbuḍe puṣhpayāgamu
sarasabumāḍale sārĕ nāḍi tama navvu
pŏri nībaim̐ jalluḍe puṣhpayāgamu
(||pavvu||)
gām̐ṭabum̐gŏlanidaṁḍam̐ gāṁtalu sigguna ninnu
būḍagānagum̐ diṭṭuḍe puṣhpayāgamu
yīḍuva śhrīveṁkaḍeśha yiṭṭĕ yalamelumaṁga
pūm̐ṭa pūḍa radu livi puṣhpayāgamu