పువ్వుల వేసి నిన్ను పొందులు చల్లీ నతఁడు
(॥పల్లవి॥)
పువ్వుల వేసి నిన్ను పొందులు చల్లీ నతఁడు
నవ్వులు నవ్వుచు నీతో ననుపై వున్నాఁడు
(॥పువ్వు॥)
వంచనేలే శిరసు వాడనేలే మోము
అంచెలఁ బతిలో మాటలాడరాదా
కంచువంటిది వలపు గాలివంటిది వయసు
పెంచకువే కోపము నీ ప్రియుఁ డీడ నున్నాఁడు
(॥పవ్వు॥)
నిట్టూర్పులేలే నీకు నిండఁ జెమరించనేలే
గుట్టుతోడఁ బతివద్దఁ గూచుండరాదా
నెట్టుకొన్నవి కాంక్షలు నిండినది తమకము
వట్టి విసుపేలే నీవద్ద నాతఁ డున్నాఁడు
(॥పవ్వు॥)
కొంతకొంత సిగ్గులేలే కొనగొనయాసలేలే
ఇంతలో శ్రీవేంకటేశు నెనయరాదా
మంతనాన మన్నించె మాముందర నెలయించె
ఇంత నిన్నుఁ గూడి యాతఁ డింటనే వున్నాఁడు
(||pallavi||)
puvvula vesi ninnu pŏṁdulu sallī nadam̐ḍu
navvulu navvusu nīdo nanubai vunnām̐ḍu
(||puvvu||)
vaṁchanele śhirasu vāḍanele momu
aṁchĕlam̐ badilo māḍalāḍarādā
kaṁchuvaṁṭidi valabu gālivaṁṭidi vayasu
pĕṁchaguve kobamu nī priyum̐ ḍīḍa nunnām̐ḍu
(||pavvu||)
niṭṭūrbulele nīgu niṁḍam̐ jĕmariṁchanele
guṭṭudoḍam̐ badivaddam̐ gūsuṁḍarādā
nĕṭṭugŏnnavi kāṁkṣhalu niṁḍinadi tamagamu
vaṭṭi visubele nīvadda nādam̐ ḍunnām̐ḍu
(||pavvu||)
kŏṁtagŏṁta siggulele kŏnagŏnayāsalele
iṁtalo śhrīveṁkaḍeśhu nĕnayarādā
maṁtanāna manniṁchĕ māmuṁdara nĕlayiṁchĕ
iṁta ninnum̐ gūḍi yādam̐ ḍiṁṭane vunnām̐ḍu