పువ్వుగట్టినట్టి మేనఁ బుక్కిలించీఁ జెమట నీ
(॥పల్లవి॥)
పువ్వుగట్టినట్టి మేనఁ బుక్కిలించీఁ జెమట నీ-
జవ్వనపు మదమె పో చలపట్టీని
(॥పువ్వు॥)
మోలకనవ్వు చిగురుమోవి మోపనీక నీ-
పలుకుఁ గోవిలలె పో పగచాటీని
తిలకపుమోమునకుఁ దేంట్ల రానీక నీ-
యలకల చెదరె పో యదలించీని
(॥పువ్వు॥)
చనవున నీముఖచందురుని వంక నీ-
చనుజక్కవలె పో చాడిచెప్పీని
మనసు చీఁకట్ల నీమదనతాపపుఁ జింత
కనుఁగవలె పో గాదెఁబోసీని
(॥పువ్వు॥)
దటపుఁ దమకపు మైదావానలానకు
నిట్టూపురులె పో నీడవెట్టీని
గుట్టుతోనుండిన కూరిమిపంపులే పోనీ-
పట్టపు వేంకటపతిఁ బట్టి తెచ్చీని
(||pallavi||)
puvvugaṭṭinaṭṭi menam̐ bukkiliṁchīm̐ jĕmaḍa nī-
javvanabu madamĕ po salabaṭṭīni
(||puvvu||)
molaganavvu sigurumovi mobanīga nī-
palugum̐ govilalĕ po pagasāḍīni
tilagabumomunagum̐ deṁṭla rānīga nī-
yalagala sĕdarĕ po yadaliṁchīni
(||puvvu||)
sanavuna nīmukhasaṁduruni vaṁka nī-
sanujakkavalĕ po sāḍisĕppīni
manasu sīm̐kaṭla nīmadanadābabum̐ jiṁta
kanum̐gavalĕ po gādĕm̐bosīni
(||puvvu||)
daḍabum̐ damagabu maidāvānalānagu
niṭṭūburulĕ po nīḍavĕṭṭīni
guṭṭudonuṁḍina kūrimibaṁpule ponī-
paṭṭabu veṁkaḍabadim̐ baṭṭi tĕchchīni