Puttamgam buttamga poddoga vimte

పుట్టఁగఁ బుట్టఁగ పొద్దొక వింతే
Language

(॥పల్లవి॥)
పుట్టఁగఁ బుట్టఁగ పొద్దొక వింతే
యెట్టు గడచే మీవిష్ణుమాయా

(॥పటపగ॥)
యెత్తిన దేహాల యెమ్ములు చివికే
చిత్తమొక్కటే చివుకదు
మొత్తముఁ బుట్టించి ముదిసె బ్రహ్మయు
పొత్తుల జీవుఁడేపో ముదియఁడు

(॥పటపగ॥)
వ్రాసే చిత్రగుప్తవరుఁడు వేసారె
వేసారెఁ పాపపువిధి నేఁడు
గాసిఁ బెరరేఁచే కాముఁడు సమసె
యీసుల సమయ వింద్రియాదులు

(॥పటపగ॥)
వినుకనివంక విజ్ఞానము వుట్టె
కనుకనే యిఁకఁ గైవాలదు
అనుగు శ్రీ వేంకటాధీశుమన్నన
తనిసినబుద్ధిఁ తప్ప దిఁక

(||pallavi||)
puṭṭam̐gam̐ buṭṭam̐ga pŏddŏga viṁte
yĕṭṭu gaḍase mīviṣhṇumāyā

(||paḍabaga||)
yĕttina dehāla yĕmmulu sivige
sittamŏkkaḍe sivugadu
mŏttamum̐ buṭṭiṁchi mudisĕ brahmayu
pŏttula jīvum̐ḍebo mudiyam̐ḍu

(||paḍabaga||)
vrāse sitraguptavarum̐ḍu vesārĕ
vesārĕm̐ pābabuvidhi nem̐ḍu
gāsim̐ bĕrarem̐se kāmum̐ḍu samasĕ
yīsula samaya viṁdriyādulu

(||paḍabaga||)
vinuganivaṁka vijñānamu vuṭṭĕ
kanugane yim̐kam̐ gaivāladu
anugu śhrī veṁkaḍādhīśhumannana
tanisinabuddhim̐ tappa dim̐ka