Puttamgaam buttinavi polamtula keegunaalu

పుట్టఁగాఁ బుట్టినవి పొలఁతుల కీగుణాలు
Language

(॥పల్లవి॥)
పుట్టఁగాఁ బుట్టినవి పొలఁతుల కీగుణాలు
నెట్టన నీ వేలితేను నేస్తములై యుండును

(॥పుట్టఁ॥)
వున్నతి సవతికాంత లొకరొకరిఁ గంటేను
సన్నల నుప్పతింతురు సాదింతురు
విన్నకన్నవారితోడ వెంగెములాడుదురు
పన్ని పతిపైఁ బెట్టి పంగింతురు

(॥పుట్టఁ॥)
ముందరికి వచ్చితేను మూతులు గిరుపుదురు
నిందింతురు వూరకే నెపా లెంతురు
అంది సింగారించుకొంటే నటుమోమై నవ్వుదురు
యెందు మేలు గలిగినా నీసడింతురు

(॥పుట్టఁ॥)
చక్కఁదనా లీడుచూపి సణఁగులు రాలుతురు
నిక్కిచూతురు యెమ్మలు నెరపుదురు
పక్కన నలమేల్ మంగపతి శ్రీవేంకటేశుఁడ
ఇక్కడ నన్నేలినందు కిఁక మెచ్చుకొందురు

(||pallavi||)
puṭṭam̐gām̐ buṭṭinavi pŏlam̐tula kīguṇālu
nĕṭṭana nī velidenu nestamulai yuṁḍunu

(||puṭṭam̐||)
vunnadi savadigāṁta lŏgarŏgarim̐ gaṁṭenu
sannala nuppadiṁturu sādiṁturu
vinnagannavāridoḍa vĕṁgĕmulāḍuduru
panni padibaim̐ bĕṭṭi paṁgiṁturu

(||puṭṭam̐||)
muṁdarigi vachchidenu mūdulu girubuduru
niṁdiṁturu vūrage nĕbā lĕṁturu
aṁdi siṁgāriṁchugŏṁṭe naḍumomai navvuduru
yĕṁdu melu galiginā nīsaḍiṁturu

(||puṭṭam̐||)
sakkam̐danā līḍusūbi saṇam̐gulu rāluduru
nikkisūduru yĕmmalu nĕrabuduru
pakkana nalamel maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa
ikkaḍa nannelinaṁdu kim̐ka mĕchchugŏṁduru