పురుషుండని శ్రుతి వొగడీనట ఆ పురుషుఁడు నిరాకారమట
(॥పల్లవి॥)
పురుషుండని శ్రుతి వొగడీనట ఆ పురుషుఁడు నిరాకారమట
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు
(॥పురు॥)
మొగమున బ్రహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుఁడట
తగు బాహువులను రాజులట ఆ తత్వమే యెంచఁగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట
(॥పురు॥)
తన వందనమునుఁ గలదట దైవము తనుఁ జూడఁ గన్నులు లేవట
తన విన్నపమునుఁ జేయునట ఆతనికిని వీనులు లేవట
తన యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తన యిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట
(॥పురు॥)
అంతాఁ దానే దైవమటా యజ్ఞము లొరులకుఁ జేయుటట
సంతతమునుఁ దా స్వతంత్రుఁడటా జపముల వరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట
(||pallavi||)
puruṣhuṁḍani śhrudi vŏgaḍīnaḍa ā puruṣhum̐ḍu nirāgāramaḍa
virasavākyamu lŏṁḍŏṁṭigi nivi viṁṭe nasaṁbaddhamulu
(||puru||)
mŏgamuna brahmalu mŏlasiraḍa ā mūridi avayavarahidum̐ḍaḍa
tagu bāhuvulanu rājulaḍa ā tatvame yĕṁcham̐ga śhūnyamaḍa
pagaḍuna tŏḍalanu vaiśhyulaḍa ā brahmamu dehamu bayalaḍa
agabaḍi pādāla śhūdrulaḍa ādani rūbamu ledaḍa
(||puru||)
tana vaṁdanamunum̐ galadaḍa daivamu tanum̐ jūḍam̐ gannulu levaḍa
tana vinnabamunum̐ jeyunaḍa ādanigini vīnulu levaḍa
tana yichchinade naivedyaṁbaḍa daivamu nore ledaḍa
tana yichcheḍi dhūbaṁbunu galadaḍa daivamu mukkunu ledaḍa
(||puru||)
aṁtām̐ dāne daivamaḍā yajñamu lŏrulagum̐ jeyuḍaḍa
saṁtadamunum̐ dā svadaṁtrum̐ḍaḍā jabamula varamula segŏṁṭaḍa
siṁtiṁpam̐ dāne yogiyaḍā seruva mokṣhamu ledaḍa
paṁtabu śhrīveṁkaḍabadimāyalu pasāriṁchina viviyaḍa