పురుషులలోనెల్లా పురుషోత్తముఁడు వాఁడె
(॥పల్లవి॥)
పురుషులలోనెల్లా పురుషోత్తముఁడు వాఁడె
తిరుతేరు మీఁద నేఁగీ దేవదేవోత్తముఁడు
(॥పురు॥)
చెక్కులు మెరవఁగాను సేసముత్యాలు రాలఁగా
యెక్కువైన తేరమీఁద నేఁగీవాఁడె
క్కువలు గరఁగుచు యిరుమేల నొరగుచు
చిక్కని నవ్వులు నవ్వీ చెలులతో వాఁడె
(॥పురు॥)
నిమ్మంట వేసుకొంటా నిక్కి నిక్కి చూచుకొంటా
యెమ్మెలకుఁ దేరిమీఁద నేఁగీ వాఁడె
తమ్ములము సారెఁ జేసి తగవల్లెవాటువేసి
చెమ్మఁజెమట గందాలఁ జెలరేఁగీవాఁడె
(॥పురు॥)
అలయుచు సాలయుచు నలమేలుమంగఁ గూడి
యెలమిఁ దిరుతేరుపై నేఁగీ వాఁడె
బలిమి శ్రీవేంకటాద్రిపతి యీ పెండ్లికొడుకు
నిలువుఁ జక్కఁదనాన నిండుకొనీ వాఁడె
(||pallavi||)
puruṣhulalonĕllā puruṣhottamum̐ḍu vām̐ḍĕ
tiruderu mīm̐da nem̐gī devadevottamum̐ḍu
(||puru||)
sĕkkulu mĕravam̐gānu sesamutyālu rālam̐gā
yĕkkuvaina teramīm̐da nem̐gīvām̐ḍĕ
kkuvalu garam̐gusu yirumela nŏragusu
sikkani navvulu navvī sĕlulado vām̐ḍĕ
(||puru||)
nimmaṁṭa vesugŏṁṭā nikki nikki sūsugŏṁṭā
yĕmmĕlagum̐ derimīm̐da nem̐gī vām̐ḍĕ
tammulamu sārĕm̐ jesi tagavallĕvāḍuvesi
sĕmmam̐jĕmaḍa gaṁdālam̐ jĕlarem̐gīvām̐ḍĕ
(||puru||)
alayusu sālayusu nalamelumaṁgam̐ gūḍi
yĕlamim̐ diruderubai nem̐gī vām̐ḍĕ
balimi śhrīveṁkaḍādribadi yī pĕṁḍligŏḍugu
niluvum̐ jakkam̐danāna niṁḍugŏnī vām̐ḍĕ