Purushottamaa annidilo poosalalo daaramavoo

పురుషోత్తమా అన్నిటిలో పూసలలో దారమవూ
Language

(॥పల్లవి॥)
పురుషోత్తమా అన్నిటిలో పూసలలో దారమవూ
వెరవెఱిఁగి ని న్నేపొద్దును సేవించఁగవలెఁ గాని

(॥పరు॥)
కదలును గాలి నీవు కదలించితే
పొదలును సస్యములు నీవు పొదలించితే
వెదకితే కీలు నీవే విశ్వంబునకు
పదిలముగా నిను వెదకి పట్టఁగవలెఁ గాని

(॥పరు॥)
కాలముఁ గర్మములో నీవు కానరాక వుండి
నేలయు మిన్నును నీవే పాలింపుచున్నాఁడవూ
నీ లీలలైన బొమ్మలాట లివి నీచేత నాడీని
కోలుముందుగా నీ సాకారము కోరి చూడవలెఁ గాని

(॥పరు॥)
యిత్తువు వరములు నీవే యిటు శ్రీవేంకటగిరిని
మొత్తమై యలమేల్మంగతో ముద మలరఁగాను
బత్తితో నినుఁ గొలిచినవారికి పరుసవేదివి నీవే
కొత్తలుగా నిన్నే నమ్మి కొలిచి బ్రదుకవలెఁ గాని

(||pallavi||)
puruṣhottamā anniḍilo pūsalalo dāramavū
vĕravĕṟim̐gi ni nnebŏddunu seviṁcham̐gavalĕm̐ gāni

(||paru||)
kadalunu gāli nīvu kadaliṁchide
pŏdalunu sasyamulu nīvu pŏdaliṁchide
vĕdagide kīlu nīve viśhvaṁbunagu
padilamugā ninu vĕdagi paṭṭam̐gavalĕm̐ gāni

(||paru||)
kālamum̐ garmamulo nīvu kānarāga vuṁḍi
nelayu minnunu nīve pāliṁpusunnām̐ḍavū
nī līlalaina bŏmmalāḍa livi nīseda nāḍīni
kolumuṁdugā nī sāgāramu kori sūḍavalĕm̐ gāni

(||paru||)
yittuvu varamulu nīve yiḍu śhrīveṁkaḍagirini
mŏttamai yalamelmaṁgado muda malaram̐gānu
battido ninum̐ gŏlisinavārigi parusavedivi nīve
kŏttalugā ninne nammi kŏlisi bradugavalĕm̐ gāni