పురుషోత్తమ నీవే బుద్ధిచ్చి కాచుట గాక
(॥పల్లవి॥)
పురుషోత్తమ నీవే బుద్ధిచ్చి కాచుట గాక
శిర సెత్తుకొని నవ్వ సిగ్గుగాదా నాకు
(॥పరు॥)
పొసఁగ పంచేంద్రియాలు పుట్టిన దేహమే మోచి
యెసఁగ జితేంద్రిఁయుఁడ నెట్టయ్యే నేను
వసగాని కోరికల వలలోనఁ జిక్కుకొని
యిసుమంతలో ముక్తుఁడ నెట్టయ్యే నేను
(॥పరు॥)
తొల్లిటి కర్మముచేత దొడ్డయైన పుట్టు పుట్టి
యెల్లవారిలో జ్ఞాని నెట్టయ్యే నేను
మల్లడి సంసారము మరగువాఁడవై యుండి
యిల్లిదివో విరక్తుఁడ నెట్టయ్యే నేను
(॥పరు॥)
పాపపుణ్యపు లోకులపంక్తిలోన నేవుండి
యేపున నీ భక్తివాఁడ నెట్లయ్యే నేను
రాపుల శ్రీ వేంకటేశ రక్షించి కీరితిఁ బొందు
యీపాటి వాఁడ ధీరుఁడ నెట్టయ్యే నేను
(||pallavi||)
puruṣhottama nīve buddhichchi kāsuḍa gāga
śhira sĕttugŏni navva siggugādā nāgu
(||paru||)
pŏsam̐ga paṁcheṁdriyālu puṭṭina dehame mosi
yĕsam̐ga jideṁdrim̐yum̐ḍa nĕṭṭayye nenu
vasagāni korigala valalonam̐ jikkugŏni
yisumaṁtalo muktum̐ḍa nĕṭṭayye nenu
(||paru||)
tŏlliḍi karmamuseda dŏḍḍayaina puṭṭu puṭṭi
yĕllavārilo jñāni nĕṭṭayye nenu
mallaḍi saṁsāramu maraguvām̐ḍavai yuṁḍi
yillidivo viraktum̐ḍa nĕṭṭayye nenu
(||paru||)
pābabuṇyabu logulabaṁktilona nevuṁḍi
yebuna nī bhaktivām̐ḍa nĕṭlayye nenu
rābula śhrī veṁkaḍeśha rakṣhiṁchi kīridim̐ bŏṁdu
yībāḍi vām̐ḍa dhīrum̐ḍa nĕṭṭayye nenu