Puraanaburushumdu bhuvi navadarimchenu

పురాణపురుషుఁడు భువి నవతరించెను
Language

(॥పల్లవి॥)
పురాణపురుషుఁడు భువి నవతరించెను
సిరుల జయంతి నేఁడు సేయరో పండుగలూ

(॥॥)
శ్రావణ బహుళాష్టమిఁ జందురుఁ డుదయించెను
ఆ వేళ రోహిణిని అద్దమ రాతిరి కాడ
దేవకి కృష్ణునిఁ గాంచె దేవతలు నుతియించ
చేవ దేరెఁ బనులెల్లా సేయరో పండుగలూ

(॥॥)
నందుని మందకు నేఁగినాఁడే వసుదేవుఁడు
కందువఁ గృష్ణు నెశోదకడఁ బెట్టి మాయఁదెచ్చి
యిందమని కంసు చేతి కిచ్చితే మాయాదేవి
చెంది విడిపంచుకొనె సేయరో పండుగలూ

(॥॥)
చిన్న కృష్ణుఁడై పెరిగి చేరి కంసుఁ బొరిగొని
యెన్న శ్రీ వేంకటేశుఁడై ఇందరిఁగాచీ నిటె
వున్నది యలమేల్మంగ వురమున నితనికి
చెన్నుమీఱి దాసులెల్ల సేయరో పండగలు

(||pallavi||)
purāṇaburuṣhum̐ḍu bhuvi navadariṁchĕnu
sirula jayaṁti nem̐ḍu seyaro paṁḍugalū

(||||)
śhrāvaṇa bahuḽāṣhṭamim̐ jaṁdurum̐ ḍudayiṁchĕnu
ā veḽa rohiṇini addama rādiri kāḍa
devagi kṛṣhṇunim̐ gāṁchĕ devadalu nudiyiṁcha
seva derĕm̐ banulĕllā seyaro paṁḍugalū

(||||)
naṁduni maṁdagu nem̐ginām̐ḍe vasudevum̐ḍu
kaṁduvam̐ gṛṣhṇu nĕśhodagaḍam̐ bĕṭṭi māyam̐dĕchchi
yiṁdamani kaṁsu sedi kichchide māyādevi
sĕṁdi viḍibaṁchugŏnĕ seyaro paṁḍugalū

(||||)
sinna kṛṣhṇum̐ḍai pĕrigi seri kaṁsum̐ bŏrigŏni
yĕnna śhrī veṁkaḍeśhum̐ḍai iṁdarim̐gāsī niḍĕ
vunnadi yalamelmaṁga vuramuna nidanigi
sĕnnumīṟi dāsulĕlla seyaro paṁḍagalu