Puraanaburusha naa manorathamu pomduga needersave

పురాణపురుష నా మనోరథము పొందుగ నీడేర్చవే
Language

(॥పల్లవి॥)
పురాణపురుష నా మనోరథము పొందుగ నీడేర్చవే
నిరుహేతుక దయానిధివి నీ వనఁగా విందూ

(॥పురాణ॥)
యెపుడు ప్రసన్నుఁడ వౌదువొ యనుచు యెదురుచూతు నీకు
అపురూపంబగు నీ సూక్తులు వివ నాలింతు లీనులను
వుపమల నిన్నును వశముచేసుకొన నూహింపు చుండుదును
చపలుఁడనై నీ మన్ననలే యిటు సారెకుఁ గోరుదును

(॥పురాణ॥)
సతతము నీ భావము దెలుసుకొనఁగ చదువులలో వెదకుదును
తతి నీ శ్రీపాదతీర్థము గొనఁగ తమకింతు నేను
హితవరులగు నీ దాసులలో నన్నెంచుకొనఁగఁ దగుదును
అతిమోదంబున నిన్ను నుతించే యందులకే నే నోరూరుదును

(॥పురాణ॥)
యేడనైన నీభక్తి గలుగుటకు యేప్రొద్దును నేఁ బ్రార్థింతు
వేడుకతో నీ సేవ సేయుటకు వేళ గాచి యుందు
జోడుగా నలమేల్మంగకుఁ బతివై చూపట్టిన శ్రీవేంకటేశ్వర
జాడతోడ మము రక్షించేవని సంతస మందుచు నుండుదును

(||pallavi||)
purāṇaburuṣha nā manorathamu pŏṁduga nīḍersave
niruheduga dayānidhivi nī vanam̐gā viṁdū

(||purāṇa||)
yĕbuḍu prasannum̐ḍa vauduvŏ yanusu yĕdurusūdu nīgu
aburūbaṁbagu nī sūktulu viva nāliṁtu līnulanu
vubamala ninnunu vaśhamusesugŏna nūhiṁpu suṁḍudunu
sabalum̐ḍanai nī mannanale yiḍu sārĕgum̐ gorudunu

(||purāṇa||)
sadatamu nī bhāvamu dĕlusugŏnam̐ga saduvulalo vĕdagudunu
tadi nī śhrībādadīrdhamu gŏnam̐ga tamagiṁtu nenu
hidavarulagu nī dāsulalo nannĕṁchugŏnam̐gam̐ dagudunu
adimodaṁbuna ninnu nudiṁche yaṁdulage ne norūrudunu

(||purāṇa||)
yeḍanaina nībhakti galuguḍagu yeprŏddunu nem̐ brārdhiṁtu
veḍugado nī seva seyuḍagu veḽa gāsi yuṁdu
joḍugā nalamelmaṁgagum̐ badivai sūbaṭṭina śhrīveṁkaḍeśhvara
jāḍadoḍa mamu rakṣhiṁchevani saṁtasa maṁdusu nuṁḍudunu