పులుగు చెప్పెడినదె పొంచి మా గురుఁడు నీకు
(॥పల్లవి॥)
పులుగు చెప్పెడినదె పొంచి మా గురుఁడు నీకు
తలఁచుకో నేఁడు నీవు దాఁచినర్థము
(॥పులు॥)
యిలమీఁద తమసొమ్ము లెవ్వరివద్ద నుండినా
తలపిడి కొలుపిడి తగిలినట్టు
తొలుత పంచేంద్రియపు దొంగలవద్ద నున్నాఁడ
వెలయ నీసొమ్మనుచు విడిపించుకొనవే
(॥పులు॥)
చేరి తమవూరివారి చెఱవట్టుకొని పోతే
కోరి కుయివోయి తెచ్చుకొన్నట్టు
వూరక నీకుక్షిలోనవున్న నన్ను నీమాయ
వీరానఁ జెఱవట్టెను విడిపించుకొనవే
(॥పులు॥)
బడిదప్పి తిరిగేటి పడుచుల తమవారు
తడయక తెచ్చుక ఆదరించినట్టు
వెడబుద్ధిఁ దిరిగేను వెఱ్ఱిని శ్రీవేంకటేశ
విడువక అజ్ఞాని నన్ను విడుపించుకొనవే
(||pallavi||)
pulugu sĕppĕḍinadĕ pŏṁchi mā gurum̐ḍu nīgu
talam̐sugo nem̐ḍu nīvu dām̐sinardhamu
(||pulu||)
yilamīm̐da tamasŏmmu lĕvvarivadda nuṁḍinā
talabiḍi kŏlubiḍi tagilinaṭṭu
tŏluda paṁcheṁdriyabu dŏṁgalavadda nunnām̐ḍa
vĕlaya nīsŏmmanusu viḍibiṁchugŏnave
(||pulu||)
seri tamavūrivāri sĕṟavaṭṭugŏni pode
kori kuyivoyi tĕchchugŏnnaṭṭu
vūraga nīgukṣhilonavunna nannu nīmāya
vīrānam̐ jĕṟavaṭṭĕnu viḍibiṁchugŏnave
(||pulu||)
baḍidappi tirigeḍi paḍusula tamavāru
taḍayaga tĕchchuga ādariṁchinaṭṭu
vĕḍabuddhim̐ dirigenu vĕṭrini śhrīveṁkaḍeśha
viḍuvaga ajñāni nannu viḍubiṁchugŏnave