పులుకడిగినయట్టి పురుషోత్తముఁడు వాఁడె
(॥పల్లవి॥)
పులుకడిగినయట్టి పురుషోత్తముఁడు వాఁడె
యెలమి నారతులు విూరెత్తరే దేవునికి
(॥పులు॥)
గొప్పయింద్రనీలాల కొండ మంచు గప్పినట్టు
నెప్పు మింట పాలవెల్లి వెరసినట్టు
విప్పు నీలమేఘముపై వెన్నెల గాసినయట్టు
కప్పురధూళిమేనఁ గప్పిరి దేవునికి
(॥పులు॥)
నిండు నై రావతముపై నీలిజగ గప్పినట్టు
వెండిమేడపైఁ జీఁకటి విడిసినట్టు
వుండరీకపుఁ గొలను పొరిఁ దేం ట్లాగినట్టు
మెండగు తట్టుపుణుఁగు మెత్తిరి దేవునికి
(॥పులు॥)
అదె నల్లఁ గలువలన కరువు లుండినట్టు
మెదిగి కస్తూరిభూమి మేరు వున్నట్టు
యెదుట శ్రీవేంకటేశుయెద నలమేల్మంగను
గుదిగుచ్చి సొమ్ములెల్లా గుప్పిరి దేవునికి
(||pallavi||)
pulugaḍiginayaṭṭi puruṣhottamum̐ḍu vām̐ḍĕ
yĕlami nāradulu viూrĕttare devunigi
(||pulu||)
gŏppayiṁdranīlāla kŏṁḍa maṁchu gappinaṭṭu
nĕppu miṁṭa pālavĕlli vĕrasinaṭṭu
vippu nīlameghamubai vĕnnĕla gāsinayaṭṭu
kappuradhūḽimenam̐ gappiri devunigi
(||pulu||)
niṁḍu nai rāvadamubai nīlijaga gappinaṭṭu
vĕṁḍimeḍabaim̐ jīm̐kaḍi viḍisinaṭṭu
vuṁḍarīgabum̐ gŏlanu pŏrim̐ deṁ ṭlāginaṭṭu
mĕṁḍagu taṭṭubuṇum̐gu mĕttiri devunigi
(||pulu||)
adĕ nallam̐ galuvalana karuvu luṁḍinaṭṭu
mĕdigi kastūribhūmi meru vunnaṭṭu
yĕduḍa śhrīveṁkaḍeśhuyĕda nalamelmaṁganu
gudiguchchi sŏmmulĕllā guppiri devunigi