Pulagala molagala punnama todane koode

పులకల మొలకల పున్నమ తోడనె కూడె
Language

(॥పల్లవి॥)
పులకల మొలకల పున్నమ తోడనె కూడె
అలివేణి నీ పతితో నాడవే వసంతము

(॥పుల॥)
మాటలు తీగెలువారె మక్కువలు చిగిరించె
మూటలకొద్దినవ్వులు మొగ లెత్తెను
వాఁటపు జవ్వనాను వసంతకాలము వచ్చె
ఆఁటదానవు పతితో నాడవే వసంతము

(॥పుల॥)
చెమటరసము లూరె సిగ్గులు పూవక పూచె
తిమురుఁ దరితీపుల తేనె లుబ్బెను
క్రమమునఁ దమకముగద్దియ మదనుఁ డెక్కె
అమర నీపతితోడ నాడనే వసంతము

(॥పుల॥)
కడుగోరితాఁకులు కాయము కాయలుగాచె
బడినే కెమ్మోవిని పండు వండెను
యెడలేక శ్రీవేంటేశుఁడిట్టె నిన్నుఁ గూడె
అడరి నీపతితోనే ఆడవే వసంతము

(||pallavi||)
pulagala mŏlagala punnama toḍanĕ kūḍĕ
aliveṇi nī padido nāḍave vasaṁtamu

(||pula||)
māḍalu tīgĕluvārĕ makkuvalu sigiriṁchĕ
mūḍalagŏddinavvulu mŏga lĕttĕnu
vām̐ṭabu javvanānu vasaṁtagālamu vachchĕ
ām̐ṭadānavu padido nāḍave vasaṁtamu

(||pula||)
sĕmaḍarasamu lūrĕ siggulu pūvaga pūsĕ
timurum̐ daridībula tenĕ lubbĕnu
kramamunam̐ damagamugaddiya madanum̐ ḍĕkkĕ
amara nībadidoḍa nāḍane vasaṁtamu

(||pula||)
kaḍugoridām̐kulu kāyamu kāyalugāsĕ
baḍine kĕmmovini paṁḍu vaṁḍĕnu
yĕḍalega śhrīveṁṭeśhum̐ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
aḍari nībadidone āḍave vasaṁtamu