పుక్కిటివీడెము నదె చెక్కిటిచేయి నిదె
(॥పల్లవి॥)
పుక్కిటివీడెము నదె చెక్కిటిచేయి నిదె
యెక్కువ తక్కువలు నీ కేల వచ్చె నమ్మా
(॥పక్కిటి॥)
వాసనఁగుబ్బలమీఁద వంకలచంద్రులు పుట్టీ
రాసెక్కి కొల దరిగె రమణి నీ వలపు
వోసరించి నీ విభుఁడు వొద్దనే వున్నాఁ డిదె
యీసుతోడ నలుక నీ కేల వచ్చెనమ్మా
(॥పక్కిటి॥)
ముంచిన దేహలతపై ముత్తెపురాసులు పుట్టీ
యెంచరాదు పంచరాదు యింతి నీ జవ్వనమ
మంచముపై దిగఁ డదే మలసీని రమణుఁడ
యించుకంతలోనే బిగు వేల వచ్చెనమ్మా
(॥పక్కిటి॥)
కన్నులకొలకులనే కప్పురపుతేట పుట్టీ
చిన్ననాడే చేవదేరె చెలిసింగారము
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁ గూడె
యెన్నరాని నివ్వెఱగు లేల వచ్చెనమ్మా
(||pallavi||)
pukkiḍivīḍĕmu nadĕ sĕkkiḍiseyi nidĕ
yĕkkuva takkuvalu nī kela vachchĕ nammā
(||pakkiḍi||)
vāsanam̐gubbalamīm̐da vaṁkalasaṁdrulu puṭṭī
rāsĕkki kŏla darigĕ ramaṇi nī valabu
vosariṁchi nī vibhum̐ḍu vŏddane vunnām̐ ḍidĕ
yīsudoḍa naluga nī kela vachchĕnammā
(||pakkiḍi||)
muṁchina dehaladabai muttĕburāsulu puṭṭī
yĕṁcharādu paṁcharādu yiṁti nī javvanama
maṁchamubai digam̐ ḍade malasīni ramaṇum̐ḍa
yiṁchugaṁtalone bigu vela vachchĕnammā
(||pakkiḍi||)
kannulagŏlagulane kappurabudeḍa puṭṭī
sinnanāḍe sevaderĕ sĕlisiṁgāramu
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐ gūḍĕ
yĕnnarāni nivvĕṟagu lela vachchĕnammā