ప్రియురాలు నీకెదురువెట్టి వలపులు నించె
(॥పల్లవి॥)
ప్రియురాలు నీకెదురువెట్టి వలపులు నించె
నియతాన నీవును మన్నించగదయ్యా
(॥॥)
వనజాక్షిపయ్యదలో వట్రువచన్నులు నీకు
ననుపున నుంకువధనము బిందెలు:
పెనగొన్నసింగారపుఁబిరుఁదు బటువుదిండు-
తనరారుమంచిరత్నాల పెండ్లిపీఁట:
(॥॥)
తరుణితురుములోనితగుమల్లెమొగ్గలు
తిరమైన సేసకు నెత్తినముత్యాలు:
పరిపరిచవులతోఁ బరగుతేనెలమోవి
వరుసఁ బెట్టినట్టిబువ్వపుఁ బళ్ళెము:
(॥॥)
పడఁతి కాఁగిటిలోని బాహులతలు నీకు
తొడిఁబడ నొనరించేతోరణాలు:
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
కడలే కెప్పుడు మెడఁగట్టినతాళి
(||pallavi||)
priyurālu nīgĕduruvĕṭṭi valabulu niṁchĕ
niyadāna nīvunu manniṁchagadayyā
(||||)
vanajākṣhibayyadalo vaṭruvasannulu nīgu
nanubuna nuṁkuvadhanamu biṁdĕlu:
pĕnagŏnnasiṁgārabum̐birum̐du baḍuvudiṁḍu-
tanarārumaṁchiratnāla pĕṁḍlibīm̐ṭa:
(||||)
taruṇidurumulonidagumallĕmŏggalu
tiramaina sesagu nĕttinamutyālu:
paribarisavuladom̐ baragudenĕlamovi
varusam̐ bĕṭṭinaṭṭibuvvabum̐ baḽḽĕmu:
(||||)
paḍam̐ti kām̐giḍiloni bāhuladalu nīgu
tŏḍim̐baḍa nŏnariṁchedoraṇālu:
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁga nīgu
kaḍale kĕppuḍu mĕḍam̐gaṭṭinadāḽi