ప్రియములు చెప్పి నిన్నుఁ బిలిచీ నీకె
(॥పల్లవి॥)
ప్రియములు చెప్పి నిన్నుఁ బిలిచీ నీకె
రయమున నూఁకొని రావయ్య లోనికి
(॥ప్రియ॥)
చనవె కలిగితేను సాదించితే నేమౌను
మన సెరిఁగిన యింతి మగవానిని
యెనసి వుండితేఁ జాలు నెంత చెనకినాఁ జెల్లు
ఘనుఁడవు రావయ్య గక్కన లోనికి
(॥ప్రియ॥)
చుట్టరిక మైనచోట సొలసితే నేమౌను
పట్టపుదేవి తనప్రాణేశ్వరుని
నెట్టుకొని వుండేచోట నెపము వేయఁగ వద్దు
అట్టె రట్టు సేయక రావయ్య లోనికిని
(॥ప్రియ॥)
ఇచ్చకమైతే మేలు యెంతనవ్వినా నేమౌను
కచ్చు వుట్టి పెండ్లాడినకాంతునిని
అచ్చపు శ్రీవేంకటేశ అలమెల్మంగ యీకె
రచ్చ కెక్కఁ గూడితివి రావయ్యా లోనికి
(||pallavi||)
priyamulu sĕppi ninnum̐ bilisī nīgĕ
rayamuna nūm̐kŏni rāvayya lonigi
(||priya||)
sanavĕ kaligidenu sādiṁchide nemaunu
mana sĕrim̐gina yiṁti magavānini
yĕnasi vuṁḍidem̐ jālu nĕṁta sĕnaginām̐ jĕllu
ghanum̐ḍavu rāvayya gakkana lonigi
(||priya||)
suṭṭariga mainasoḍa sŏlaside nemaunu
paṭṭabudevi tanaprāṇeśhvaruni
nĕṭṭugŏni vuṁḍesoḍa nĕbamu veyam̐ga vaddu
aṭṭĕ raṭṭu seyaga rāvayya lonigini
(||priya||)
ichchagamaide melu yĕṁtanavvinā nemaunu
kachchu vuṭṭi pĕṁḍlāḍinagāṁtunini
achchabu śhrīveṁkaḍeśha alamĕlmaṁga yīgĕ
rachcha kĕkkam̐ gūḍidivi rāvayyā lonigi