ప్రియములు చెప్పఁగాను బిగియనేల
(॥పల్లవి॥)
ప్రియములు చెప్పఁగాను బిగియనేల
రయమున లోనికి రమ్మనవే నీవు
(॥ప్రియ॥)
వలచినదానికి వాసు లెంచుకోఁదగదు
చెలిమిగలదానికి చింత వలదు
కలసిన యిల్లాలికి కాదుగూడదనరాదు
పిలువవే నీమగనిఁ బేరుకొని యిపుడు
(॥ప్రియ॥)
పాయలేని దానికి పంతాకుఁ బనిలేదు
పాయపుదానికి నెగ్గుపట్టనేఁటికి
చాయకత్తైనదానికి సాదించి పోరఁగూడదు
చేయివట్టి తియ్యఁగదే చెనకి యీతనిని
(॥ప్రియ॥)
చుట్టమైనదానికి సోదించి చూడఁగరాదు
గుట్టెరిఁగినదానికి గుంపించనేల
ఇట్టె శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతలోనే
ముట్టి కాఁగిలించుకోవే ముదమందీఁ దాను
(||pallavi||)
priyamulu sĕppam̐gānu bigiyanela
rayamuna lonigi rammanave nīvu
(||priya||)
valasinadānigi vāsu lĕṁchugom̐dagadu
sĕlimigaladānigi siṁta valadu
kalasina yillāligi kādugūḍadanarādu
piluvave nīmaganim̐ berugŏni yibuḍu
(||priya||)
pāyaleni dānigi paṁtāgum̐ baniledu
pāyabudānigi nĕggubaṭṭanem̐ṭigi
sāyagattainadānigi sādiṁchi poram̐gūḍadu
seyivaṭṭi tiyyam̐gade sĕnagi yīdanini
(||priya||)
suṭṭamainadānigi sodiṁchi sūḍam̐garādu
guṭṭĕrim̐ginadānigi guṁpiṁchanela
iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtalone
muṭṭi kām̐giliṁchugove mudamaṁdīm̐ dānu