ప్రియములే చెప్పి పతిఁ బిలుచుక రాఁగదరే
(॥పల్లవి॥)
ప్రియములే చెప్పి పతిఁ బిలుచుక రాఁగదరే
క్రియ యెరఁగక మరి కెరలించ నేఁటికే
(॥ప్రియ॥)
వాడికగా నందరిపై వలపులు చుల్లుఁగాక
వేడుక కాని కెంతైనా వేసట గద్దా
జాడతో మోవితేనెల చవి మరిగినవాఁడు
అడికకు వెరచీనా అదలించ నేఁటికే
(॥ప్రియ॥)
పోసరించి కెళవుల పొందులే వెదకుఁ గాక
ఆ సోదకాని కెంతైన నలపు గద్దా
రాసికెక్క గాంతులతొ రచ్చలు సేసెటివాఁడు
దోసానకు లోగినా దూర నిఁక నేఁటికే
రాతిరి బగలు నిట్టే రతుల నోలాడుఁగాక
యేతరి కాని కెంతైనా నెంగిలి గద్దా
యీతల శ్రీవేంకటేశుఁ డిదె నన్ను నేలినాఁడు
నీతి యిఁకఁ దప్పీనా నేర మెంచ నేఁటికే
(||pallavi||)
priyamule sĕppi padim̐ bilusuga rām̐gadare
kriya yĕram̐gaga mari kĕraliṁcha nem̐ṭige
(||priya||)
vāḍigagā naṁdaribai valabulu sullum̐gāga
veḍuga kāni kĕṁtainā vesaḍa gaddā
jāḍado movidenĕla savi mariginavām̐ḍu
aḍigagu vĕrasīnā adaliṁcha nem̐ṭige
(||priya||)
posariṁchi kĕḽavula pŏṁdule vĕdagum̐ gāga
ā sodagāni kĕṁtaina nalabu gaddā
rāsigĕkka gāṁtuladŏ rachchalu sesĕḍivām̐ḍu
dosānagu loginā dūra nim̐ka nem̐ṭige
rādiri bagalu niṭṭe radula nolāḍum̐gāga
yedari kāni kĕṁtainā nĕṁgili gaddā
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannu nelinām̐ḍu
nīdi yim̐kam̐ dappīnā nera mĕṁcha nem̐ṭige