Priyamu toduda ninnum biluva nampenu mammu

ప్రియము తోడుత నిన్నుఁ బిలువ నంపెను మమ్ము
Language

(॥పల్లవి॥)
ప్రియము తోడుత నిన్నుఁ బిలువ నంపెను మమ్ము
రయమున నిఁకనైనా రావయ్య మావెంటను

(॥॥)
మచ్చిక నీ వాడిన మాటలు దలఁచుకొని
ఇచ్చల నెదురుచూచు నింతి నీకును
పచ్చదోరణాలు గట్టి పండుగనాటి వలెనే
విచ్చేతు వంటా నీకు విందాయిత్త పెట్టేను

(॥॥)
తెఱవ తన వరుస దినము దలఁచుకొని
గుఱిగాఁ బాన్పువఱచుకొని వున్నది
మెఱసి పెండ్లికి వలె మేలుకట్లు గట్టించి
పిఱిగొన ముత్యాలు పేఁట పట్టువెట్టేను

(॥॥)
కోరి నీవు గూడేటికూటమి దలఁచుకొని
గారవపు సింగారానఁ గై సేసెను
యీ రీతి శ్రీ వేంకటేశ యెనసితి వీకె నిట్టే
మేరతో నలమేల్మంగ మెడ యెక్కె నిప్పుడూ

(||pallavi||)
priyamu toḍuda ninnum̐ biluva naṁpĕnu mammu
rayamuna nim̐kanainā rāvayya māvĕṁṭanu

(||||)
machchiga nī vāḍina māḍalu dalam̐sugŏni
ichchala nĕdurusūsu niṁti nīgunu
pachchadoraṇālu gaṭṭi paṁḍuganāḍi valĕne
vichchedu vaṁṭā nīgu viṁdāyitta pĕṭṭenu

(||||)
tĕṟava tana varusa dinamu dalam̐sugŏni
guṟigām̐ bānpuvaṟasugŏni vunnadi
mĕṟasi pĕṁḍligi valĕ melugaṭlu gaṭṭiṁchi
piṟigŏna mutyālu pem̐ṭa paṭṭuvĕṭṭenu

(||||)
kori nīvu gūḍeḍigūḍami dalam̐sugŏni
gāravabu siṁgārānam̐ gai sesĕnu
yī rīdi śhrī veṁkaḍeśha yĕnasidi vīgĕ niṭṭe
merado nalamelmaṁga mĕḍa yĕkkĕ nippuḍū