Priyamu seppevela bigiyanela

ప్రియము చెప్పేవేళ బిగియనేల
Language

(॥పల్లవి॥)
ప్రియము చెప్పేవేళ బిగియనేల
నయగారితనముల నవ్వు లిట్టె వలెనా

(॥॥)
కూటమికి నాతఁడు కొంగువట్టుకుండఁగాను
యేటికిఁబెనఁగులాడే వెందాఁకాను
నీటున జోలిసేసేవు నేరుపరి విన్నిటాను
మాట లేమిగలిగినా మరి యాడరాదా

(॥॥)
ఆసపడి మోవితేనె లాతఁడిట్టె యడుగఁగా
వాసులేల నెరపేవు వట్టిబీరాన
వోసరించి యేడలేనివూడిగా లొనరించేవు
చేసేటినీబత్తి మరి చెల్లించరాదా

(॥॥)
యిప్పుడే శ్రీవేంకటేశుఁడిటు నిన్నుఁగూడఁగాను
తప్పక యేమి చూచేవు తమకించేవు
అప్పటిని మెచ్చి మెచ్చి యట్టె బుజ్జగించేవు
కొప్పుదువ్వి మరి వేఁడుకొని మొక్కరాదా

(||pallavi||)
priyamu sĕppeveḽa bigiyanela
nayagāridanamula navvu liṭṭĕ valĕnā

(||||)
kūḍamigi nādam̐ḍu kŏṁguvaṭṭuguṁḍam̐gānu
yeḍigim̐bĕnam̐gulāḍe vĕṁdām̐kānu
nīḍuna jolisesevu nerubari vinniḍānu
māḍa lemigaliginā mari yāḍarādā

(||||)
āsabaḍi movidenĕ lādam̐ḍiṭṭĕ yaḍugam̐gā
vāsulela nĕrabevu vaṭṭibīrāna
vosariṁchi yeḍalenivūḍigā lŏnariṁchevu
seseḍinībatti mari sĕlliṁcharādā

(||||)
yippuḍe śhrīveṁkaḍeśhum̐ḍiḍu ninnum̐gūḍam̐gānu
tappaga yemi sūsevu tamagiṁchevu
appaḍini mĕchchi mĕchchi yaṭṭĕ bujjagiṁchevu
kŏppuduvvi mari vem̐ḍugŏni mŏkkarādā