ప్రియము గలిగినట్టి పెండ్లికొడుకవు నీవు
(॥పల్లవి॥)
ప్రియము గలిగినట్టి పెండ్లికొడుకవు నీవు
నయముతో మొక్కు మొక్కీ నవ్వు నవ్వరాదా
(॥॥)
రెప్పలెత్తి చూచి నీతో రెట్టింపుమాట లాడి
చిప్పిలుఁ జెమట చిందీ చెక్కులవెంట
వుప్పతించి తిట్టరాదు వొడివట్టి తియ్యరాదు
కప్పురగందికి మచ్చికలు చూపరాదు
(॥॥)
చిగురుమోవి వంచి చేయిఁ జేయు నప్పళించి
జిగిమించేవలపులు చిమ్మిరేఁచీని
తగవులఁ బెట్టరాదు తరితీపుసేయరాదు
మగవుకు జనవిచ్చి మన్నించరాదా
(॥॥)
కందువతోఁ జన్నులంటి కడుబిగ్గెఁ గాఁగిలించి
సందడి మర్మములంటి చల్లీ నూర్పులు
ఇందులో శ్రీవేంకటేశ యెంచరాదు పంచరాదు
మందగజగమనకు మనసియ్యరాదా
(||pallavi||)
priyamu galiginaṭṭi pĕṁḍligŏḍugavu nīvu
nayamudo mŏkku mŏkkī navvu navvarādā
(||||)
rĕppalĕtti sūsi nīdo rĕṭṭiṁpumāḍa lāḍi
sippilum̐ jĕmaḍa siṁdī sĕkkulavĕṁṭa
vuppadiṁchi tiṭṭarādu vŏḍivaṭṭi tiyyarādu
kappuragaṁdigi machchigalu sūbarādu
(||||)
sigurumovi vaṁchi seyim̐ jeyu nappaḽiṁchi
jigimiṁchevalabulu simmirem̐sīni
tagavulam̐ bĕṭṭarādu taridībuseyarādu
magavugu janavichchi manniṁcharādā
(||||)
kaṁduvadom̐ jannulaṁṭi kaḍubiggĕm̐ gām̐giliṁchi
saṁdaḍi marmamulaṁṭi sallī nūrbulu
iṁdulo śhrīveṁkaḍeśha yĕṁcharādu paṁcharādu
maṁdagajagamanagu manasiyyarādā