ప్రేమముతో నిందరినిఁ బెండ్లాడితివి
(॥పల్లవి॥)
ప్రేమముతో నిందరినిఁ బెండ్లాడితివి
కామించి యేరీతి నేలి కరుణించేవయ్యా
(॥ప్రేమ॥)
కలికి కాఁగిటిలోనే కాఁపురము సేయఁగాను
వెలఁదులకెల్లా నిఁక వేళ యేడది
చలపట్టి యేపొద్దు సరసము లాడఁగాను
మలసి ఇతరులకు మరి వేళ యేడది
(॥ప్రేమ॥)
చనవున నాపె మించి సారె మోవి యానఁగాను
వెనకటిసతులకు వేళ యేడది
కనుఁగొని యట్టె తనకతలే నీకుఁ జెప్పఁగా
మనవి చెప్పేవారికి మరి వేళ యేడది
(॥ప్రేమ॥)
చెంత నీ శిరసుమీఁద సేస లాపె వెట్టఁగాను
వింత సవతులకెల్లా వేళ యేడది
ఇంతలో శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మంతనపు చుట్టాలకు మరివేళ యేడది
(||pallavi||)
premamudo niṁdarinim̐ bĕṁḍlāḍidivi
kāmiṁchi yerīdi neli karuṇiṁchevayyā
(||prema||)
kaligi kām̐giḍilone kām̐puramu seyam̐gānu
vĕlam̐dulagĕllā nim̐ka veḽa yeḍadi
salabaṭṭi yebŏddu sarasamu lāḍam̐gānu
malasi idarulagu mari veḽa yeḍadi
(||prema||)
sanavuna nābĕ miṁchi sārĕ movi yānam̐gānu
vĕnagaḍisadulagu veḽa yeḍadi
kanum̐gŏni yaṭṭĕ tanagadale nīgum̐ jĕppam̐gā
manavi sĕppevārigi mari veḽa yeḍadi
(||prema||)
sĕṁta nī śhirasumīm̐da sesa lābĕ vĕṭṭam̐gānu
viṁta savadulagĕllā veḽa yeḍadi
iṁtalo śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
maṁtanabu suṭṭālagu mariveḽa yeḍadi